ఒంటి చేత్తో ఒడిసిపడుతూ అద్భుతమైన క్యాచ్... న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్...

Published : Mar 26, 2021, 03:52 PM IST
ఒంటి చేత్తో ఒడిసిపడుతూ అద్భుతమైన క్యాచ్... న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్...

సారాంశం

గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో సూపర్ మ్యాన్ ట్రెంట్ బౌల్ట్‌ క్యాచ్... మూడో వన్డేలో కూడా న్యూజిలాండ్ విజయం... మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్...      

న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ చాలా మంచి ఫీల్డర్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడే ఈ స్టార్ పేసర్, ఫీల్డింగ్‌లో కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తూ ఉంటాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసంతోనే క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపోయేలా చేశాడు ట్రెంట్ బౌల్ట్. 

న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ బౌలింగ్‌లో లిటన్ దాస్, ఫుల్ షాట్ ఆడబోయాడు. అయితే ఎడ్జ్ తీసుకున్న బంతి, గాల్లోకి ఎగిరింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు.

 

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసిన 318 పరుగుల భారీ స్కోరు చేయగా బంగ్లాదేశ్ 154 పరుగులకి ఆలౌట్ అయ్యంది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది న్యూజిలాండ్...

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది