INDvsENG 2nd ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... రిషబ్‌ పంత్‌కి అవకాశం...

Published : Mar 26, 2021, 01:09 PM ISTUpdated : Mar 26, 2021, 01:15 PM IST
INDvsENG 2nd ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... రిషబ్‌ పంత్‌కి అవకాశం...

సారాంశం

మూడు మార్పులతో బరిలో ఇంగ్లాండ్ జట్టు... తాత్కాలిక సారథిగా జోస్ బట్లర్... గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్... వికెట్ కీపర్‌గా పంత్...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన రెండు వన్డేలకు జోస్ బట్లర్  సారథిగా వ్యవహారించబోతున్నాడు.

ఇంగ్లాండ్ జట్టు తరుపున లియామ్ లివింగ్‌స్టోన్ వన్డే ఆరంగ్రేటం చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో గాయపడిన సామ్ బిల్లింగ్స్‌తో పాటు మార్క్ వుడ్ కూడా నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు. మరోవైపు టీమిండియా తరుపున గత మ్యాచ్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

ఇంగ్లాండ్ జట్టు: డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జాసన్ రాయ్, బెయిర్ స్టో, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, టామ్ కురరాన్, అదిల్ రషీద్, రేస్ తోప్లే
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది