తండ్రి పుట్టినరోజు: కూతురు ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. కానీ..!

Siva Kodati |  
Published : Mar 25, 2021, 06:19 PM IST
తండ్రి పుట్టినరోజు: కూతురు ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. కానీ..!

సారాంశం

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన తండ్రికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన చిన్న నాటి ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇదే సమయంలో తన కుమార్తె వామికా కోహ్లీతో కలిసి వున్న ఫోటోను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘‘ 1961 లో ప్రారంభమైన ప్రత్యేక ఎడిషన్ 60 అద్భుతమైన సంవత్సరాలను జరుపుకుంది. నిజాయితీ, కరుణ, అంగీకారం, ధర్మాల యొక్క శక్తి ఏంటో మాకు తెలియజేశారు. నిజాయితీగా, ఇబ్బంది లేకుండా ఉండటం ద్వారా మనశ్శాంతి గొప్పదనం గురించి ఆయన నొక్కి చెప్పారు.

ఎన్నో రకాలుగా ఆయన తనలో ప్రేరణ నింపారు. లవ్ యూ పాపా మీకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అనుష్క శర్మ తన తండ్రికి విషెస్ తెలియజేశారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులకు జనవరి 11, 2021న ఒక ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే.

వీరు తమ గారాల పట్టికి వామికా అని దుర్గాదేవి పేరు పెట్టుకున్నారు. అయితే తమ బిడ్డ ఫోటోలను తీయవద్దని ఈ జంట ఫోటోగ్రాఫర్లను అభ్యర్ధించింది. అలాగే వారికి వ్యక్తిగతంగా బహుమతులను సైతం పంపింది.

విరాట్- అనుష్క శర్మలు డిసెంబర్ 11, 2017లో ఇటలీలోని టుస్కానీలో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఆ ఏడాదిలో సోషల్ మీడియాతో పాటు ప్రజలు ఎక్కువగా చర్చించుకున్న అంశంగా నిలిచిపోయింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 

PREV
click me!

Recommended Stories

IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !