ట్రావిస్ హెడ్ సెంచ‌రీ.. వెస్టిండీస్ ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

By Mahesh Rajamoni  |  First Published Jan 19, 2024, 12:11 PM IST

Australia vs West Indies: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ చిత్తుగా ఓడింది. తొలి టెస్టులో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ పూర్తికావ‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియా 4వ రోజు టిక్కెట్ల డ‌బ్బును తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది.  
 


Australia vs West Indies: అడిలైడ్ ఓవల్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 188 ప‌రుగులకు ఆలౌట్ అయిన విండీస్.. రెండో ఇన్నింగ్స్ లో కేవ‌లం 120 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. రెండో ఇన్నింగ్స్ ను ముగించిన త‌ర్వాత విండీస్ కు 26 ప‌రుగులు అధిక్యం ల‌భించింది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకే కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించిన విండీస్ కు చివ‌ర‌కు నిరాశే మిగిలింది.

26 ప‌రుగుల ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 6.4 ఓవ‌ర్ల‌లో 10 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌల‌ర్లు నిప్పులు చేరిగారు. తొలి ఇన్నింగ్స్ ల విండీస్ బ్యాటర్లలో కిర్క్ మెకెంజీ ఒక్కడే 50 పరుగులతో రాణించాడు. చివరలో షమర్ జోసెఫ్ 36 పరుగులు చేశాడు.రెండో ఇన్నింగ్స్ విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూకట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తొలి ఇన్నింగ్స్ లో ప్యాట్ కమిన్స్ 4, హాజిల్ వుడ్ 4 వికెట్లు తీసుకున్నారు. రెండో ఇన్నింగ్ లో హాజిల్ వుడ్ 5 వికెట్లు తీసుకున్నాడు.

Latest Videos

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 119 పరుగులు చేశాడు. దీంతో హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 5, గ్రీవ్స్ 2 వికెట్లు తీసుకున్నారు. 

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ షురూ.. భారత్ మళ్లీ ట్రోఫీ సాధిస్తుందా? టీమ్, షెడ్యూల్ ఇదే..

మ్యాచ్ హైలెట్స్: 

వెస్టిండీస్ బ్యాటింగ్:188 & 120
ఆస్ట్రేలియా బ్యాటింగ్: 283 & 26/0

బౌలింగ్:
హాజిల్ వుడ్ - 9 వికెట్లు
ప్యాట్ కమిన్స్ - 4 వికెట్లు
షమర్ జోసెఫ్ - 5 వికెట్లు 

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : ట్రావిస్ హెడ్ (119 పరుగులు) 

టికెట్లకు రీఫండ్ చేయనున్న క్రికెట్ ఆస్ట్రేలియా

మూడు రోజుల్లో మ్యాచ్ ముగియడంతో నాలుగో రోజు కొనుగోలు చేసిన టికెట్లకు రీఫండ్ చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. టికెటెక్ వెబ్సైట్, కాల్సెంటర్ లేదా మెయిల్ ఆర్డర్ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారికి టికెట్ కొనుగోలు చేసిన క్రెడిట్ కార్డుకు ఆటోమేటిక్ గా రీఫండ్స్ ప్రాసెస్ అవుతాయి. ఆఫ్టర్ పే కొనుగోళ్లు నేరుగా మీ ఆఫ్టర్ పే ఖాతాకు రీఫండ్ చేయబడతాయని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా, గురువారం నుంచి బ్రిస్బేన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

మ‌రో సంచలనం.. ఒకేసారి నలుగురు ప్రపంచ ఛాంపియన్ క్రికెట‌ర్ల రిటైర్మెంట్.. !

click me!