కోహ్లీ, రోహిత్ వ‌ల్లకాలేదు.. స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన సాయి సుద‌ర్శ‌న్

By Mahesh Rajamoni  |  First Published May 10, 2024, 10:26 PM IST

GT vs CSK Sai Sudarshan : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయ‌ర్లు శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల వ‌ల్ల కానీ సచిన్ టెండూల్కర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు యంగ్ ప్లేయ‌ర్ సాయి సుద‌ర్శ‌న్. 
 


Chennai Super Kings vs Gujarat Titans : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై  సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్దాయి. ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌రుగుల సునామీ సృష్టించారు. ఓపెన‌ర్లు శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ ఇద్ద‌రు సెంచ‌రీ సాధించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఐపీఎల్ హిస్ట‌రీలో100వ సెంచ‌రీని గిల్ సాధించ‌గా, త‌న కెరీర్ లో 6వ సెంచ‌రీ. ఇక సాయి సుద‌ర్శ‌న్ కు ఇది తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. 

కోహ్లీ, రోహిత్ వ‌ల్లకానీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన సాయి సుద‌ర్శ‌న్.. 

Latest Videos

undefined

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ చెన్నై బౌలింగ్ ను చీల్చి చెండాడారు. ఇద్ద‌రు ప్లేయ‌ర్లు 50 బంతుల్లో సెంచ‌రీలు సాధించారు. 103 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో సాయి సుద‌ర్శ‌న్ 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. గిల్ 9 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 104 ప‌రుగుల ఇన్నింగ్స్ తో మెరిశాడు. వీరిద్ద‌రి ఆట చూసిన చెన్నై ప్లేయ‌ర్లకు దిమ్మ‌దిరిగిపోయింది. ఇద్ద‌రు ఔట్ అయిన త‌ర్వాత గుజ‌రాత్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మ‌దించింది. 20 ఓవ‌ర్ల‌లో 231-3 ప‌రుగులు సాధించింది.

ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ

ఈ క్ర‌మంలోనే సాయి సుద‌ర్శ‌న్ అరుదైన ఫీట్ ను సాధించాడు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ మ్యాచ్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో సాయి సుదర్శన్ ఐపీఎల్ లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని కేవ‌లం 25 ఇన్నింగ్స్ ల‌లోనే అందుకున్నాడు. అంత‌కుముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉంది. స‌చిన్ ఐపీఎల్ లో 1000 ప‌రుగుల మార్క్ ను 31 ఇన్నింగ్స్ ల‌లో అందుకున్నాడు. ఈ ఫీట్ ను సాధించ‌డం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వల్ల కూడా కాలేదు. అయితే, చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 1000 ప‌రుగుల మార్కును 31 ఇన్నింగ్స్ ల‌లో అందుకున్నాడు. అలాగే, గిల్-సాయిలు ఐపీఎల్ లో అత్య‌ధిక పార్టనర్ షిప్ రికార్డును సృష్టించారు.

 

In the blink of an eye... 👀

Just 2️⃣​5️⃣ innings for ⚡ai ⚡u to etch his name in the record books! | | | pic.twitter.com/p6LDNoy6zs

— Gujarat Titans (@gujarat_titans)

 

ఐపీఎల్ హిస్టరీలో అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన టాప్-5 ప్లేయ‌ర్లు వీరే.. 

click me!