GT vs CSK : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ లు అద్భుతమైన ఇన్నింగ్స్ తో సెంచరీలు సాధించారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
Chennai Super Kings vs Gujarat Titans : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్దాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ను చీల్చిచెండాడారు. శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ లు ఫోర్లు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించి సెంచరీలు సాధించారు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్ కష్టాలు పెరిగాయి.
గిల్, సాయి సుదర్శన్ సూపర్ సెంచరీలు
undefined
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ లు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ చెన్నై బౌలింగ్ ను చీల్చి చెండాడారు. ఇద్దరు ప్లేయర్లు 50 బంతుల్లో సెంచరీలు సాధించారు. 103 పరుగుల తన ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. గిల్ 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగుల ఇన్నింగ్స్ తో మెరిశాడు. వీరిద్దరి ఆట చూసిన చెన్నై ప్లేయర్లకు దిమ్మదిరిగిపోయింది. ఇద్దరు ఔట్ అయిన తర్వాత గుజరాత్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది. 20 ఓవర్లలో 231-3 పరుగులు సాధించింది.
ఆరంభంలో చెన్నైకి షాక్ తగిలింది..
232 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రచిన్ రవీంద్ర రనౌట్ తో చెన్నై కి మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత ఓవర్ లోనే అజింక్యా రహానే ఒక పరుగుకే పెవిలియన్ కు చేరాడు. మూడో ఓవర్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, మోయిన్ అలీలు గుజరాత్ కు కొద్ది సేపు చెమటలు పట్టించారు. సూపర్ షాట్స్ కొడుతూ వీరిద్దరు హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. డారిల్ మిచెల్ 63, మొయిన్ అలీ 56 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. దీంతో మళ్లీ చెన్నై టీమ్ కు కష్టాలు తిరిగొచ్చాయి.
ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే..
శివమ్ దుబే 21, రవీంద్ర జడేజా 18 పరుగులతో కొద్దిసేపు క్రీజులో ఉన్నారు కానీ భారీ ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. చివరలో ధోని మెరుపులు మెరిపించినా అప్పటికే మ్యాచ్ చేయిదాటిపోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంఎస్ ధోని చివరలో 3 సిక్సర్లు, ఒక ఫోర్ తో 26 పరుగులు చేశాడు. కీలకమైన మ్యాచ్ లో చెన్నై ఓటమిపాలు కావడంతో ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్ కు క్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్ గెలిచివుంటే మెరుగైన స్థితిలో ఉండేది. ఇక గుజరాత్ గెలుపుతో ప్లేఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం జట్ల స్థానాలు గమనిస్తే నెట్ రన్ రేటు కీలకంగా మారనుందని తెలుస్తోంది.
An emphatic batting display backed 🆙 by a comprehensive bowling performance 🙌 make it even for the season as they complete a 35 runs win over 👏
Scorecard ▶️ https://t.co/PBZfdYt4lR | pic.twitter.com/ThkkI35ofY
కోహ్లీ, రోహిత్ వల్లకాలేదు.. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన సాయి సుదర్శన్