The Ashes: మూడు సార్లు క్యాచ్ డ్రాప్.. నాలుగో సారి నోబాల్.. అదృష్టమంటే అతడిదే..

Published : Dec 17, 2021, 04:57 PM ISTUpdated : Dec 17, 2021, 04:58 PM IST
The Ashes: మూడు సార్లు క్యాచ్ డ్రాప్.. నాలుగో సారి నోబాల్.. అదృష్టమంటే అతడిదే..

సారాంశం

Australia Vs England: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ హీరో మార్నస్ లబూషేన్ కు నాలుగుసార్లు లైఫ్ లు వచ్చాయి. దీంతో అతడు మూడంకెల స్కోరు చేశాడు.

క్రికెట్ మ్యాచ్ లో ఆడటానికి అవకాశాలు రావడమే గొప్ప... వచ్చిన ఛాన్స్ ను వినియోగించుకోవడానికి ప్రతి ఆటగాడు తమ శక్తి మేర ప్రయత్నిస్తాడు. అయితే గ్రౌండ్ లో ఆడుతున్న వారిలో ముఖ్యంగా బ్యాటర్లకు  వచ్చే ఛాన్సులు చాలా తక్కువ. ఏదో ఒకటీ అరా వస్తే.. ఇక క్రీజును అంటిపెట్టుకునే ఉండే ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్ లో చాలా మందే ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ కు ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు  లైఫ్ లు వచ్చాయి.  ఆ మాత్రం చాలదు  ఒక  బ్యాటర్ సెంచరీ చేయడానికి...!!

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన మార్నస్ లబూషేన్ కు నాలుగు లైఫ్ లు వచ్చాయి.  ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్యాచులు (ముఖ్యంగా వికెట్ కీపర్  జోస్ బట్లర్ రెండు క్యాచులు వదిలేశాడు) వదిలేయడంతో బతికిపోయిన లబూషేన్ కు నో బాల్ రూపంలో కూడా లక్ కలిసొచ్చింది.

 

తొలి ఇన్నింగ్స్ లో లబూషేన్.. 21, 45, 95 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచులను ఇంగ్లాండ్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. మూడు జీవనదానాలు లభించడంతో సెంచరీకి చేసిన  అతడు.. 1032 పరుగుల వద్ద కూడా రాబిన్సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.  దీంతో అతడు  పెవిలియన్  వైపునకు వెళ్తుండగా.. అంపైర్ ఒకసారి నోబాల్ చెక్ చేసేదాకా ఆగాలని అతడికి  సూచించాడు. అంపైర్ అనుమానమే నిజమైంది.  రాబిన్సన్ వేసిన బంతి నోబాల్ గా తేలింది. దీంతో లబూషేన్ తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు. కానీ ఎక్కువసేపు  నిలువలేదు. మరో 3 పరుగులు జోడించి.. 105 పరుగుల వద్ద రాబిన్సన్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

 

స్టీవ్ స్మిత్ సెంచరీ మిస్.. :

రెండో టెస్టుకు ముందు కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగాడనే కారణంగా  మ్యాచుకు దూరమైన  పాట్ కమిన్స్  స్థానంలో  సారథ్య బాధ్యతలు మోస్తున్న స్టీవ్ స్మిత్.. తొలి ఇన్నింగ్స్ లో త‌ృటిలో సెంచరీ కోల్పోయాడు.  201 బంతులాడిన స్మిత్.. 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 93  పరుగులు  చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో అతడు 28 వ సెంచరీని చేజార్చుకున్నాడు.  స్మిత్ రివ్యూకు వెళ్లినా అతడికి ఫలితం దక్కలేదు.  ఈ ఇన్నింగ్స్ లో నర్వస్ 90 లలో ఔటైన రెండో బ్యాటర్ స్మిత్. ఆటలో తొలి రోజైన  గురవారం నాడు వార్నర్ కూడా95  పరుగుల వద్ద నిష్క్రమించాడు. 

ఆస్ట్రేలియా 473/9  డిక్లేర్.. ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. : 

అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్ ను 473 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 150.4 ఓవర్లు ఆడిన ఆసీస్.. 9 వికెట్లు కోల్పోయి ఈ స్కోరు సాధించింది. వార్నర్ (95), లబూషేన్ (103), స్మిత్ (93) తో పాటు వికెట్ కీపర్  అలెక్స్ క్యారీ (51) రాణించారు. వీళ్లకు తోడు ఆఖర్లో టెయిలెండర్లు స్టార్క్ (39 నాటౌట్), నెసర  (35) లు ధాటిగా ఆడారు. 

ఇక రెండో రోజు  మూడు సెషన్ల పాటు ఆడిన  ఆసీస్.. ఆఖర్లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ ఇచ్చింది. అలసిపోయి ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల పని పడుదామని భావించిన కంగారూల వ్యూహం ఫలించింది.  ఇంగ్లీష్ ఓపెనర్లు.. హసీబ్ హమీద్ (6), రోరీ బర్న్స్ (4) లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ కు చేరారు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. స్టార్క్, నెసర్ లు తలో వికెట్ పడగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే