The Ashes: అర్ధరాత్రి పడుకోకుండా ఇవేం పనులు స్మిత్..? వీడియో షేర్ చేసిన ఆసీస్ సారథి భార్య

Published : Dec 19, 2021, 01:42 PM IST
The Ashes: అర్ధరాత్రి  పడుకోకుండా ఇవేం పనులు స్మిత్..? వీడియో షేర్ చేసిన ఆసీస్ సారథి భార్య

సారాంశం

Australia Vs England: రెండో టెస్టు కూడా సొంతమైనట్టేనని ఆసీస్ జట్టు సభ్యులందరూ ఆనందంలో ఉంటే ఆ జట్టు స్టాండ్ బై  కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం అర్థరాత్రి లేచి...!

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య  అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగుతున్నది. ఈ టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.  కాగా రెండో టెస్టులో ఆసీస్ స్టాండ్  బై కెప్టెన్ స్టీవ్ స్మిత్.. తాజాగా చేసిన ఓ పని  సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఓసారి చేసినట్టుగానే అతడు శనివారం రాత్రి కూడా  షాడో బ్యాటింగ్ చేశాడు. జట్టు సభ్యులందరూ అడిలైడ్ టెస్టు  కంగారూల సొంతమైనట్టేనని ఆనందంలో ఉంటే స్మిత్ మాత్రం అర్థరాత్రి లేచి చేసిన ఈ పనిని  ఏకంగా ఆయన భార్యే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది. 

శనివారం రాత్రి ఆట ముగిసిన తర్వాత అర్థరాత్రి తన గదిలోకి వచ్చిన స్మిత్.. బ్యాట్ ను పట్టుకుని  షాడో బ్యాటింగ్ (బాల్ లేకుండానే  బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం) ప్రాక్టీస్ చేశాడు. ఇటీవలే కొత్త బ్యాట్ తీసుకున్న స్మిత్.. దానిని నిశితంగా పరిశీలించాడు. ఆ గదిలోనే బ్యాట్  ఎలా ఉంది..? దాంతో తాను  మళ్లీ పరుగుల వరద పారించొచ్చా..? అని చెక్ చేసుకున్నాడు.

 

ఈ వీడియోలో స్మిత్ షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. వెనకాల టీవీలో ప్రముఖ అమెరికా నటుడు సిట్కామ్ సీన్ఫీల్డ్ నటించిన ఓ సినిమా ప్లే అవుతున్నది.  సిట్కామ్ కు  వీరాభిమాని అయిన స్మిత్..  ఖాళీ సమయం దొరికితే ఆయన సినిమాలు  చూస్తాడట. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు..‘అర్థరాత్రి భార్యతో కాలక్షేపం చేయక ఇవేం పనులు స్మిత్..’ అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఇదిలాఉండగా స్మిత్ ఇలా షాడో బ్యాటింగ్  ప్రాక్టీస్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ  ఏడాది జనవరిలో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే చేశాడు. 

 

వాళ్లిద్దరూ కూడా.. : 

స్టీవ్ స్మిత్ ఒక్కడే కాదు.. గతంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఓసారి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు హోటల్ రూమ్ లో ఇలాగే చేశాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత్ తో మ్యాచ్ లో అదరగొట్టిన పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ కూడా మ్యాచుకు ముందు ఏకంగా స్టేడియంలోనే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియో  వైరలైన విషయం తెలిసిందే. 

ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం : 

ఇక అడిలైడ్ టెస్టులో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని సాధించేందుకు ఆస్ట్రేలియా కు మరో ఛాన్స్..  రెండో టెస్టులో భాగంగా  నాలుగో రోజు ఆటలో ఆసీస్.. రెండో ఇన్నింగ్సులో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. దీంతో ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు 467 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది.  ఆసీస్ జట్టులో తొలి ఇన్నింగ్సులో సెంచరీ చేసిన లబూషేన్.. రెండో ఇన్నింగ్సులో హాఫ్ సెంచరీ (51) చేశాడు.  ట్రావిస్ హెడ్ (51), కమారున్ గ్రీన్ (33) రాణించారు. 

మరో రోజునర ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ డే అండ్ నైట్ టెస్టులో భారీ స్కోరును ఛేదించడం.. ఆసీస్ బౌలర్లను నిలువరించి 468 పరుగులు చేయడం అసంభవం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో కూడా ఇంగ్లాండ్ ఓటమి ఖాయంగా అనిపిస్తున్నది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !