
Top 5 current Test batsmen with the most runs : భారత లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. తన కెరీర్ లో టెండూల్కర్ 15,921 పరుగులు చేశాడు. అయితే, ప్రస్తుతం క్రికెట్ లో ఇంకా కొనసాగుతూ టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్ల లిస్టు లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..
5. ఏంజెలో మాథ్యూస్
శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ టెస్టు క్రికెట్ లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలలో ఐదో స్థానంలో ఉన్నాడు. మాథ్యూస్ ఇప్పటివరకు 7,608 పరుగులు చేశాడు. 37 సంవత్సరాల వయస్సు కలిగిన అతను తన కెరీర్ చివరి దశలో ఉన్నాడని చెప్పవచ్చు.
4. కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్. ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరు. ఇటీవలే 34 ఏళ్లు నిండిన కీవీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో 8,743 పరుగులు చేశాడు.
3. విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ కూడా ఉంటారు. ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన ఈ స్టార్ టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్రస్తుత బ్యాటర్లలో టాప్-5 లో ఉన్న ఒకేఒక్క భారత ప్లేయర్. కోహ్లీ టెస్టుల్లో 8,848 పరుగులు చేశాడు. 35 ఏళ్ల వయస్సులో ఉన్న కోహ్లీ మరో 2-3 సంవత్సరాల పాటు క్రికెట్ లో కొనసాగే అవకాశముంది.
2. స్టీవ్ స్మిత్
ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న ఈ స్టార్ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్ లో 9,685 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లలో స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సగటును కలిగి ఉన్న ప్లేయర్.
1. జో రూట్
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్. అద్భుతమైన ఆటతో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతూ అత్యధిక పరుగుల లిస్టులో టాప్ లో ఉన్న ప్లేయర్ జోరూట్. 33 ఏళ్ల వయసున్న ఈ ఆటగాడు 12,027 పరుగులు చేశాడు. 10,000 పరుగుల క్లబ్‌లో ఉన్న ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో ఒకేఒక్కడు. సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే అవకాశాలు ఇతనికి పుష్కలంగా ఉన్నాయి.