IPL 2025: కేఎల్ రాహుల్ కు షాక్.. లక్నో సూపర్ జెయింట్స్ ఏం చేయ‌బోతోంది..?

By Mahesh Rajamoni  |  First Published Aug 27, 2024, 3:22 PM IST

IPL 2025-KL Ramul : ఐపీఎల్ 2025 కి ముందు మెగా వేలం జ‌ర‌గ‌నుంది. కేఎల్ రాహుల్ విష‌యంలో లక్నో సూపర్ జెయింట్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త సీజ‌న్ లో రాహుల్-ల‌క్నో టీమ్ వివాదం ఇప్ప‌టికీ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గానే ఉంది. 
 


IPL 2025-KL Ramul : ఐపీఎల్ 2025 కోసం 10 ఫ్రాంఛైజీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వేలం నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రు ఏ టీమ్ లో ఉంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్ర‌యాణం గురించి అనేక ఊహాగ‌నాలు వినిపిస్తున్నాయి. అత‌న్ని లక్నో టీమ్ వ‌దులుకోవ‌చ్చు అనే వాద‌న‌ల‌తో పాటు కేఎల్ రాహుల్ లక్నోకు ఎలాగైనా వీడ్కోలు పలుకుతాడ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి త‌రుణంలో స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కొనసాగించనుంద‌ని స‌మాచారం. అయితే, అది కెప్టెన్‌గా మాత్రం కాదు.

Latest Videos

undefined

గ‌త సీజ‌న్ లో కేఎల్ రాహుల్, ఆ టీమ్ య‌జ‌మానికి స్టేడియంలో బ‌హిరంగ చ‌ర్చ హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసందే. ల‌క్నో టీమ్ మ్యాచ్ ఓడిపోవ‌డంతో ఆ టీమ్ ఓన‌ర్ రాహుల్ పై చిందులేశాడు. ఇది క్రికెట్ వ‌ర్గాల‌ను షేక్ చేసింది. దీంతో రాహుల్ జ‌ట్టుకు గుడ్ బై చెప్ప‌డం ఖాయం అనే చ‌ర్చ సాగింది. ల‌క్నో కూడా రాహుల్ ను వ‌దిలిపెడుతుంద‌ని కూడా చ‌ర్చ న‌డిచింది. అయితే, రాబోయే సీజ‌న్ లో కేఎల్ రాహుల్ ను జ‌ట్టుతోనే అంటిపెట్టుకుని ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. కెప్టెన్ గా కాకుండా కేవ‌లం ప్లేయ‌ర్ గానే జ‌ట్టుతో ఉంచుకోనున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అత‌ని బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ ల‌ను ఆశిస్తున్న ల‌క్నో టీమ్ కెప్టెన్సీ ఒత్తిడిని త‌గ్గించ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

 

దీంతో ల‌క్నో టీమ్ ను రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ఎవ‌రు ముందుకు న‌డిపిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. లక్నో ఫ్రాంచైజీకి సన్నిహిత వర్గాలు రాహుల్‌ను కొనసాగించనున్నట్లు ధృవీకరించాయి. ఇప్పుడు కెప్టెన్సీ రేసులో ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్  చూడ‌వ‌చ్చు. తాజాగా జ‌రిగిన స‌మావేశంలో కేఎల్ రాహుల్ విష‌యంలో సీఈవో సంజీవ్ గోయెంకా, అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఐఏఎన్ఎస్ క‌థ‌నాలు పేర్కొన్నాయి. అలాగే, కొత్త కెప్టెన్ కోసం అన్వేష‌న కొన‌సాగుతున్న‌ద‌నీ, రిటైన్ చేసుకునే ఆట‌గాళ్ల‌లో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ లు ముందున్నార‌ని నివేదించింది. 

click me!