World Cup: వరల్డ్ కప్‌లో‌ ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగుతీస్తా.. ఈ తెలుగు నటి కామెంట్

By Mahesh K  |  First Published Nov 18, 2023, 2:52 PM IST

వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగుతీస్తా అని తెలుగు నటి రేఖా బోజ్ ఎక్స్‌లో ప్రకటించారు. ఈ ప్రకటనపై తీవ్ర స్పందన వచ్చింది. ఆ నిరసనలపైనా స్పందిస్తూ తాను ఎందుకు ఆ ప్రకటన చేసిందో రేఖా వివరించింది.
 


హైదరాబాద్: రేపు జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నది. ముఖ్యంగా భారత్‌లో ఈ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ ఏర్పడింది. ప్రపంచ కప్ సిరీస్‌లో టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తూ ఫైనల్ మ్యాచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. రేపు గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని మార్లెస్ కూడా హాజరై తిలకించనున్నారు. ఈ మ్యాచ్ పై తెలుగు నటి షాకింగ్ కామెంట్ చేసింది.

అందరి దృష్టిని ఆకర్షించుకునేలా తెలుగు నటి రేఖా బోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరిగెడుతానని ప్రకటించింది. ఈ కామెంట్ పై నెటిజన్లు పెద్ద మొత్తంలో స్పందిస్తున్నారు. కొందరు ఈ ప్రకటన చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం చీప్ పబ్లిసిటీ స్టంట్ అని, అటెన్షన్ గ్రాబ్ చేయడానికే అని మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం టైం చెబితే ట్రావెలింగ్ షెడ్యూల్ చేసుకుంటానని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Latest Videos

Also Read: 1 లక్షా 30 వేల మంది ముందు టీమిండియాని ఓడించడం కంటే గొప్ప కిక్ ఏముంటుంది! - ప్యాట్ కమ్మిన్స్..

If India wins the World Cup,
I will streak on Visakhapatnam beach.
India World Cup కొడితే, వైజాగ్ బీచ్ లో streaking చేస్తా...

— Rekha Boj (@rekha_boj)

ఆమె కామెంట్ పై వచ్చిన నిరసనకు స్పందించింది. టీమిండియాకు ప్రేమ, మద్దతు, అభిమానాన్ని చాటుకోవడమే తన ప్రధమ ఉద్దేశ్యం అని వివరించింది. ఈ నటి దామిని విల్లా, మాంగళ్యం, కలయ తస్మై నమ:, రంగీల వంటి సినిమాల్లో ఈమె నటించింది.

2011 వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ భారత్ విన్ అయినప్పుడు బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఇలాంటి ప్రకటనే చేసింది. టీమిండియా గెలిస్తే నగ్నంగా పరుగెడుతానని ఆమె చేసిన ప్రకటన అప్పుడు కూడా సంచలనమైంది. 

click me!