1 లక్షా 30 వేల మంది ముందు టీమిండియాని ఓడించడం కంటే గొప్ప కిక్ ఏముంటుంది! - ప్యాట్ కమ్మిన్స్..

By Chinthakindhi Ramu  |  First Published Nov 18, 2023, 1:40 PM IST

టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. స్టేడియంలో మాకు లభించే సపోర్ట్ చాలా తక్కువ... అదే మాకు అడ్వాంటేజ్ - ప్యాట్ కమ్మిన్స్ కామెంట్లు.


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని వరుసగా రెండు పరాజయాలతో మొదలెట్టింది ఆస్ట్రేలియా. మరో మ్యాచ్ ఓడితే ఆసీస్ పనైపోయేది. ఈ రెండు పరాజయాల తర్వాత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా, వరుసగా 8 మ్యాచుల్లో గెలిచి ఫైనల్‌కి దూసుకొచ్చింది..

తొలి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతన్ని తప్పించి, స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ అప్పగించాలనే డిమాండ్ కూడా వినిపించింది. అయితే ప్యాట్ కమ్మిన్స్, తన కూల్ అండ్ కామ్ కెప్టెన్సీతో ఆసీస్‌ని ఫైనల్‌కి తీసుకొచ్చాడు..

Latest Videos

‘టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఫైనల్ మ్యాచ్‌లో స్టేడియం మొత్తం నిండిపోతుంది. అందరూ టీమిండియాకే సపోర్ట్ చేస్తారని తెలుసు. జనాల్లో మాకు లభించే సపోర్ట్ చాలా తక్కువ..

లక్షా 30 వేల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయాలంటే టీమిండియా ఓడించాలి.. అంత కంటే పెద్ద కిక్ ఏముంటుంది. మా జట్టులో కొంతమంది ఇప్పటికే ఫైనల్స్ ఆడి, గెలిచినవాళ్లు ఉన్నారు. వారి అనుభవం మాకు సహాయపడుతుంది. 
 
ఫైనల్‌కి స్పిన్ పిచ్ తయారు చేసే ఛాన్స్ ఉంది. పిచ్ ఏదైనా స్టార్క్, జోష్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి మాకు పిచ్‌పైన ఎలాంటి కంప్లైట్స్ లేవు... ఫైనల్‌లోనే తేల్చుకుంటాం..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్...
 

click me!