2023 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నామినేషన్లను ప్రకటించిన ఐసీసీ... విరాట్ కోహ్లీతో పాటు టీమిండియ నుంచి మహ్మద్ షమీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా..
అక్టోబర్ 5న మొదలైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ క్లైమాక్స్‌కి చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో ఇండియా, ఆస్ట్రేలియాతో తలబడుతోంది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసింది ఐసీసీ...
ఒకే ఎడిషన్‌లో 700+ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు రేసులో టాప్‌లో నిలిచాడు. అలాగే 2023 సీజన్‌లో 10 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, 10 మ్యాచుల్లో 594 పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డి కాక్, 6 మ్యాచుల్లో 23 వికెట్లు తీసిన మహ్మద్ షమీ ‘ప్లేయర్ ఆఫ్ ది అవార్డు’ నామినేషన్లలో నిలిచారు..
వీరితో పాటు 10 మ్యాచుల్లో 578 పరుగులు చేసిన న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, 8 మ్యాచుల్లో 398 పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, 10 మ్యాచుల్లో 124+ స్ట్రైయిక్ రేటుతో 550 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 552 పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ డార్ల్ మిచెల్, 10 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రాలకు నామినేషన్లలో చోటు దక్కింది..
జనాల ఓట్లతో పాటు ఐసీసీ ఓటమింకా అకాడమీ సభ్యులు వేసే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌లో ఎన్ని ఓట్లు వచ్చినా, ఫైనల్‌లో వీళ్లు ఇచ్చే పర్ఫామెన్స్ ఆధారంగా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఇవ్వడం జరుగుతుంది.
మీరు కూడా https://www.icc-cricket.com/awards/player-of-the-tournament# వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఓటును వేయొచ్చు. అయితే ఓటు వేసేందుకు కచ్ఛితంగా సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.