కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... టీ20ల్లో ప్రపంచ రికార్డు నమోదు

Published : Aug 05, 2019, 02:37 PM ISTUpdated : Aug 05, 2019, 03:30 PM IST
కోహ్లీని వెనక్కినెట్టిన  రోహిత్... టీ20ల్లో ప్రపంచ రికార్డు నమోదు

సారాంశం

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత  సాధించాడు.  టీ20  ఫార్మాట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ సింగిల్ గా ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పైచేయి సాధించాడు. ప్లోరిడా వేదికన వెస్టిండిస్ తో జరిగిన రెండో టీ20లో రోహిత్ హాఫ్ సెంచరీ(67 పరుగులు)తో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ జట్టును గెలిపించడమే కాదు టీ20ల్లో అత్యధిక అర్థశతకాలు బాదిన ఏకైక క్రికెటర్ రికార్డు సృష్టించాడు. 

టీ20 క్రికెట్ ఫార్మాట్ లో కోహ్లీ, రోహిత్ లు ఇద్దరికి మంచి రికార్డుంది. దీంతో విండీస్ తో జరిగే రెండో టీ20వరకు వీరిద్దరి ఖాతాలో సమానంగా 20 హాఫ్ సెంచరీలున్నాయి. ఇలా ఈ ఫార్మట్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును వీరిద్దరు సంయుక్తంగా పంచుకున్నారు. కానీ విండీస్ పై ఓపెనర్ రోహిత్ మరో అర్థశతకాన్ని బాదగా  కోహ్లీ మాత్రం 28 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ అత్యధిక హాప్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. 

అయితే అతి తక్కువ ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించిన రికార్డు మాత్రం కోహ్లీ పేరిటే వుంది. అతడు కేవలం కేవలం 64 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధిస్తే రోహిత్ మాత్రం 88 ఇన్నింగ్సుల్లో 21వ అర్థశతకాన్ని నమోదుచేసుకున్నాడు. రోహిత్, కోహ్లీల మధ్య పోటీ అటుంచితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక అర్థశతకాల జాబితాలో భారత ఆటగాళ్లే టాప్ లో నిలవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 

 వీరిద్దరి తర్వాత టీ20ల్లో అత్యధిక అర్థశతకాల జాబితాలో కివీస్ ఓపెనర్ మార్టిన్  గుప్తిల్ మూడో స్థానంలో నిలిచాడు. అతడు ఖాతాలో 16 హాఫ్ సెంచరీలున్నాయి.వీండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ 15, కివీస్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ లు 15 సెంచరీలతో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ నుండి కోహ్లీ, రోహిత్ ల రికార్డుకు దరిదాపుల్లో ఒక్క ఆటగాడు కూడా లేడు. మరో ఓపెన్  శిఖర్ ధవన్ 9 హాఫ్ సెంచరీలు సాధించి వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో నిలిచిన భారత ఆటగాడు.  

సంబంధిత వార్తలు

విండీస్ తో టీ20 సీరిస్... వరల్డ్ రికార్డు కోసం కోహ్లీ, రోహిత్ లు పోటీ 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఐపీఎల్ వేలంలో రూ. 74 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే!
IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్