కోహ్లీ కన్నా స్మిత్ గొప్పవాడన్న ఇంగ్లాండ్ క్రికెటర్, నెటిజన్ల ఫైర్

Siva Kodati |  
Published : Aug 05, 2019, 09:53 AM IST
కోహ్లీ కన్నా స్మిత్ గొప్పవాడన్న ఇంగ్లాండ్ క్రికెటర్, నెటిజన్ల ఫైర్

సారాంశం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన శతకంతో జట్టును గట్టెక్కించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీ సాధించాడు. అతని ఆటతీరుతో ముగ్థుడైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రాబ్ కీ ... విరాట్ కోహ్లీ కన్నా స్టీవ్ స్మిత్ నైపుణ్యమున్న ఆటగాడు అంటూ ట్వీట్ చేశాడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ క్రికెటర్ స్టివ్ స్మిత్‌లో ఎవరు గొప్ప... అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన శతకంతో జట్టును గట్టెక్కించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీ సాధించాడు.

అతని ఆటతీరుతో ముగ్థుడైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రాబ్ కీ ... విరాట్ కోహ్లీ కన్నా స్టీవ్ స్మిత్ నైపుణ్యమున్న ఆటగాడు అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై టీమిండియా అభిమానులు మండిపడుతూ.. సోషల్ మీడియాలో రాబ్‌ కీని ట్రోల్ చేస్తున్నారు.

అవును టెస్టుల్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.. అయితే అన్ని ఫార్మాట్లలో ఎవరు అత్యుత్తమమో చెప్పకండి.. ఎవరు అత్యుత్తమ ఆటగాడో మీకు తెలుసని ఒక అభిమాని కామెంట్ చేశారు. కోహ్లీ కన్నా స్టీవ్ స్మిత్ మెరుగే... బ్యాటింగ్‌లో కాదు కేవలం పేపర్ వాడటంలో అంటూ మరోవ్యక్తి సెటైర్ వేశాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్
IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !