Venkatesh Iyer: తలైవాను ఇమిటేట్ చేసిన వెంకటేశ్ అయ్యర్.. రజినీకాంత్ బర్త్ డే కు గ్రేట్ ట్రిబ్యూట్

By Srinivas MFirst Published Dec 12, 2021, 3:35 PM IST
Highlights

Rajinikanth Birthday: తలైవా రజినీకాంత్ బర్త్ డే ను పురస్కరించుకుని టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తన ఛాతి మీద రజినీ టాటూ వేసుకుంటే తాజాగా వెంకటేశ్ అయ్యర్ కూడా తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. 

సూపర్ స్టార్ రజినికాంత్ పుట్టినరోజు నాడు పలువురు క్రికెటర్లు ఈ లెజెండరీ యాక్టర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఇప్పటికే టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఛాతీ మీద రజినీకాంత్ టాటూను వేయించుకోగా.. తాజాగా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తన అభిమాన నటుడికి తనదైన శైలిలో బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న అయ్యర్.. చండీగఢ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ చేయగానే రజినీకాంత్ స్టైల్ లో గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ వీడియోను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ట్విట్టర్ లో షేర్ చేసింది. 

భాషా సినిమాలో రజినీకాంత్.. కళ్లద్దాలను స్టైల్ గా తిప్పుతూ పెట్టుకోవడం  అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా ‘తలైవా’ చాలా సినిమాలలో ఈ గ్లాసెస్ పెట్టుకునే స్టైల్ ను వాడాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో కూడా సెంచరీ చేయగానే అయ్యర్.. రజినీకాంత్ స్టైల్ లో గ్లాసెస్ పెట్టుకుంటున్నట్టు అనుకరించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట  వైరల్ గా మారుతున్నది. 

 

Our Sunday couldn't get any better! 😍

Can you decode 's celebration? 🤔 pic.twitter.com/7wpLMKEJ44

— KolkataKnightRiders (@KKRiders)

రజినికాంత్ అభిమనే.. 

తమిళ సూపర్ స్టార్ కు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వెంకటేశ్ అయ్యర్ కూడా రజినీ ఫ్యానే. ఈ విషయాన్ని అతడే ఓ సందర్భంలో చెప్పాడు. అయ్యర్ మాట్లాడుతూ.. ‘నేను తలైవా భక్తుడిని. నేను ఆయన సినిమాలన్నీ  చూస్తాను. ఆయన లెజెండ్..’అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఇదీ చదవండి : Rajinikanth: ఛాతిపై తలైవా టాటూ వేసుకున్న భజ్జీ.. రజినీకాంత్ కు తన స్టైల్లో బర్త్ డే విషెస్.. ఫ్యాన్స్ ఖుషీ

 

వన్డే జట్టుకు పిలుపు..? 

విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న వెంకటేశ్ అయ్యర్ కు భారత వన్డే జట్టు నుంచి పిలుపు ఖాయంగా అనిపిస్తున్నది. టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో  సతమతమవతున్న నేపథ్యంలో భారత జట్టును ఆల్ రౌండర్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. కాగా మధ్యప్రదేశ్ కు ఆడుతున్న అయ్యర్.. చండీగఢ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు ఆపత్కాలంలో సెంచరీ చేశాడు. 113 బంతుల్లోనే 151 పరుగులు చేశాడు.  మొత్తంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో 348 పరుగులు చేశాడు. బౌలర్ గా కూడా 6 వికెట్లు తీశాడు.     అంతకుముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు మ్యాచులాడి 155 పరుగులు సాధించాడు. 

ఇక తాజా ప్రదర్శనతో అయ్యర్.. సౌతాఫ్రికా టూర్ కు ఎంపికచేసే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతడు టీమ్ లోకి వచ్చే అవకాశాలే ఎక్కువున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ అయ్యర్  ఈ టూర్ లో ఎంపికై రాణిస్తే  మాత్రం.. హార్ధిక్ పాండ్యాకు  భారత జట్టులో తలుపులు మూసుకుపోయినట్టే. 

click me!