Rajinikanth: ఛాతిపై తలైవా టాటూ వేసుకున్న భజ్జీ.. రజినీకాంత్ కు తన స్టైల్లో బర్త్ డే విషెస్.. ఫ్యాన్స్ ఖుషీ

By Srinivas MFirst Published Dec 12, 2021, 1:45 PM IST
Highlights

Super Star Rajinikanth Birthday: తమిళనాట రజినీకాంత్ ను దేవుడి కంటే ఎక్కువగా ఆరాదిస్తారు ఆయన అభిమానులు. డిసెంబర్ 12 వచ్చిందంటే వాళ్లకు పండుగే. తాజాగా తలైవా బర్త్ డే కు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు టర్భోనేటర్. 

డిసెంబర్ 12 వచ్చిందంటే తమిళనాడులో రజినీకాంత్ అభిమానులకు  ఓ చిన్న సైజు రాష్ట్రీయ పండుగ వచ్చినట్టే. ఎందుకంటే ఈ రోజు ఆ రాష్ట్ర ప్రజలు ‘తలైవా’గా ఆరాదించే  సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.  రజినీకాంత్ క్రేజ్ ఒక్క తమిళనాడుకే పరిమితం కాలేదు. దక్షిణాది లోనే కాదు. భారతదేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు పొందిన ఈ తలైవాకు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్  తనదైన స్టైల్ లో బర్త్ డే విషెస్ తెలిపాడు. ఏకంగా రజినీ కాంత్ టాటూను తన ఛాతీ మీద పచ్చబొట్టుగా వేసుకున్నాడు. 

సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన హర్భజన్ సింగ్.. తన గుండెల మీద రజినీకాంత్ పచ్చబొట్టు ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేస్తూ.. ‘నా ఛాతీ మీద  సూపర్ స్టార్ ను కలిగిఉన్నాను. మీరు 80వ దశకంలో బిల్లా.. 90లలో భాషా.. 2000 లలో అన్నాత్తే (పెద్దన్న).. భారతీయ సినిమా సూపర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అని రాసుకొచ్చాడు. అది కూడా తమిళ్ లో రాయడం విశేషం. 

 

కాగా.. ఈ ట్వీట్ తమిళ అభిమానులకు జోష్ తెప్పించింది.  ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో షేర్ చేసిన ఈ ఫోటోకు లైకులు, ట్వీట్ లతో  హర్బజన్ సోషల్ మీడియా ఖాతాలు మోతెక్కిపోతున్నాయి. 

ఇదిలాఉండగా రెండ్రోజుల క్రితం హర్భజన్  షేర్ చేసిన ఓ ఫోటో కూడా ట్విట్టర్ లో వైరలవుతున్నది. ఆ ట్వీట్లో భజ్జీ.. నెటిజనులకు ఓ పరీక్ష పెట్టాడు. 1997-98 దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన అండర్-19  వరల్డ్ కప్ కు సంబంధించిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. అందులో  తనతో ఉన్న మిగతా ఇద్దరు క్రికెటర్లు ఎవరో చెప్పుకోవాలని కోరాడు. 

 

Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK

— Harbhajan Turbanator (@harbhajan_singh)

ఈ ఫోటోలో బక్క పలుచగా ఉన్న భజ్జీని సులువుగానే గుర్తుపట్టిన నెటిజన్లు.. పక్కనున్న ఇద్దరినీ మాత్రం చూసి ఖంగుతిన్నారు. ఆ ఇద్దరే నాటి పాక్ ఆటగాడు, ఇప్పుడు దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్న స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కాగా మరొకరు పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రాజా. వీరిద్దరు పాక్ అండర్-19 జట్లుకు ఆడారు. కాగా, పలు కారణాలతో తాహీర్ పాక్ ను వీడి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లగా హసన్ రాజా మాత్రం ఆ జట్టుతోనే ఉన్నాడు. 

click me!