అంబానీ కుటుంబ పెళ్లి వేడుక‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు.. స‌చిన్, ధోని, హార్దిక్ పాండ్యాల వీడియోలు వైర‌ల్

By Mahesh Rajamoni  |  First Published Mar 1, 2024, 2:29 PM IST

Radhika & Anant Ambani’s Pre-Wedding: అంబానీ కుటుంబంలో వివాహ వేడుక ఘ‌నంగా జ‌రుగుతోంది. జామ్‌నగర్‌లో జ‌రుగుతున్న‌ రాధిక - అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ లో భార‌త స్టార్ ప్లేయ‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్, ఎంఎస్ ధోని, పాండ్యా బ్ర‌ద‌ర్స్ స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు త‌ళుక్కున మెరిశారు. 
 


Radhika & Anant Ambani’s Pre-Wedding: రిలయన్స్ అధినేత‌ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో వివాహ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుక శుక్రవారం జామ్‌నగర్‌లో జ‌రుగుతోంది. గ్రాండ్ వేడుకలో ప‌లువురు వీవీఐపీలు హాజ‌ర‌య్యారు. వారిలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. అంబానీ కుటుంబ వివాహ వేడుక‌కు విచ్చేసిన టీమిండియా క్రికెట‌ర్ల‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆయ‌న భార్య ఉన్నారు. అలాగే, స‌చిన్ టెండూల్క‌ర్ కుటుంబం, భారత ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా వివాహానికి ముందు వేడుకకు వెళ్లేందుకు విమానాశ్రయం వెలుపల కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారాయి.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Latest Videos

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !

వీరిలో పాటు జహీర్ ఖాన్, అతని భార్య సాగరిక ఘట్గే, సూర్యకుమార్ యాదవ్ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈవెంట్‌కు హాజరయ్యే వీవీఐపీల‌లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్, ప్రఖ్యాత బార్బాడియన్ గాయని రిహన్న, మల్టీ-ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్, బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ , అర్జున్ కపూర్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, చిత్రనిర్మాత అయాన్ ముఖర్జీ, దర్శకుడు అట్లీ, బిల్ గేట్స్, గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా వంటి చాలా మంది ప్ర‌ముఖులు ఉన్నారు.

 

హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, సౌదీ అరేబియా కంపెనీ అరమ్‌కో చైర్‌పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమాకు కూడా ఆహ్వానాలు అందుకున్నారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ అనే గ్రామంలో సాంప్రదాయ 'అన్న సేవ'తో వివాహానికి ముందు ఆచారాలు ప్రారంభమయ్యాయి. ఈ క్ర‌మంలోనే దాదాపు 51,000 మంది గ్రామస్తులకు గుజరాతీ ఆహారాన్ని అందించారు అంబానీ కుటుంబం స్వ‌యంగా వ‌డ్డించింది.

 అయ్యో కేన్ మామ ఇలా ఔట‌య్యావేంది.. ! 12 ఏండ్ల‌లో ఇదే తొలిసారి.. !

click me!