Rohit Sharma: గల్లీ క్రికెట్ ఆడిన టీమిండియా కెప్టెన్.. వైరల్ అవుతున్న హిట్ మ్యాన్ వీడియో

Published : Jun 15, 2022, 02:24 PM ISTUpdated : Jun 15, 2022, 03:05 PM IST
Rohit Sharma: గల్లీ క్రికెట్ ఆడిన టీమిండియా కెప్టెన్.. వైరల్ అవుతున్న హిట్ మ్యాన్ వీడియో

సారాంశం

Rohit Sharma: టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరేముందు.. 

ప్రపంచంలో.. ముఖ్యంగా మన దేశంలో ఎంత తోపు క్రికెటర్ అయినా  చిన్నతనంలో బ్యాట్ పట్టగానే క్రికెట్ అకాడమీలకు వెళ్లి నిష్ణాతులైన కోచ్ ల దగ్గర ట్రైనింగ్ తీసుకుని తిరిగివచ్చి జాతీయ  జట్టులో అదరగొట్టిన వాళ్లు లేరు. ఎంతటి క్రికెటర్ అయినా ముందు బ్యాట్ పట్టింది గల్లీలోనే. క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంది ఇరుకు సందుల్లోనే. వికెట్లు కాని వికెట్లు.. బ్యాట్ కాని బ్యాట్ తో.. ఇరుకు వీధుల్లో చుట్టుపక్కల ఇండ్ల వాళ్ల కిటికీ అద్దాలు పగలగొట్టినవాళ్లే. ఇంటి యజమానులతో రోజూ తిట్లు తిన్నవాళ్లే. అందుకు నాటి సచిన్ టెండూల్కర్ నుంచి నేటి యశ్ ధుల్ వరకు ఎవరూ అతీతులు కాదు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ  గల్లీ క్రికెట్ ఆడాడు. 

టీమిండియా కెప్టెన్ హోదాలో  అవసరమనుకుంటే ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడేలో ఒంటరిగా క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునే స్థాయి ఉన్న రోహిత్.. ఇలా గల్లీ క్రికెట్ ఆడటం వెనుక ప్రత్యేక కారణాలేమీ లేవు.  

దక్షిణ ముంబైకి ఆనుకుని ఉండే వర్లీలో  రోహిత్ గల్లీ క్రికెట్ ఆడాడు. బాంద్రాలో ఉండే హిట్ మ్యాన్.. వర్లీ వైపుగా వెల్లగా అక్కడ పలువురు  కుర్రాళ్లు రోడ్డు మీదే గల్లీ క్రికెట్ ఆడుతున్నారు.  వారిని చూపి కార్ దిగి వచ్చిన రోహిత్.. బ్యాట్ పట్టుకుని వారితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ చాలా ఉత్సాహంగా గడిపాడు. తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన పుల్ షాట్ ఆడి  వారిని అలరించాడు. 

 

16న ఇంగ్లాండ్ కు తొలి బ్యాచ్.. 

ఇంగ్లాండ్ తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్టు సిరీస్ లోని చివరి టెస్టును ఆడేందుకు  రోహిత్, విరాట్, బుమ్రా, షమీతో కూడిన భారత జట్టు  ఈనెల 16న ఇంగ్లాండ్ కు బయల్దేరనుంది.  సెకండ్ బ్యాచ్ లో టీమిండియా కు తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్ కు  పయనమవుతారు.  జులై 1 నుంచి 5 వరకు ఇండియా-ఇంగ్లాండ్ చివరి టెస్టులో తలపడనున్నాయి. టెస్టు ముగిశాక భారత్.. ఇంగ్లాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20 లు కూడా ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి నేరుగా విండీస్ కు బయల్దేరనుంది.

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమా విహారి, ఛటేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు