గెలిచిన ఆనందం మిగిలకుండానే, ఇంగ్లాండ్‌పై వేటు వేసిన ఐసీసీ... ఫైనల్ ఆశలు గల్లంతు...

Published : Jun 15, 2022, 01:56 PM IST
గెలిచిన ఆనందం మిగిలకుండానే, ఇంగ్లాండ్‌పై వేటు వేసిన ఐసీసీ... ఫైనల్ ఆశలు గల్లంతు...

సారాంశం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకున్న ఇంగ్లాండ్... స్లో ఓవర్ రేటు కారణంగా 40 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఇంగ్లాండ్ జట్టుకి ఏదీ కలిసి రావడం లేదు. 13 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, కెప్టెన్‌ని, హెడ్ కోచ్‌ని మార్చిన తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకుని న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ని 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది...

ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఇంగ్లాండ్ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది ఐసీసీ. రెండో ఇన్నింగ్స్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఇంగ్లాండ్ టీమ్‌కి 40 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లు కోత విధించింది...

ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో 13 మ్యాచుల్లో 3 విజయాలు, 7 పరాజయాలు, 4 డ్రాలతో 8వ స్థానంలో ఉంది ఇంగ్లాండ్. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఫైనల్‌కి ఇంగ్లాండ్ అర్హత సాధించడం దాదాపు అసాధ్యమే. విజయాల శాతం ఆధారంగా ఫైనల్ చేరే రెండు జట్లను నిర్ణయిస్తోంది ఐసీసీ. దీంతో ఇకపై జరిగే అన్ని మ్యాచుల్లో అద్భుత విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుతం 25 శాతం విజయాల రేటుతో ఉన్న ఇంగ్లాండ్ మహా అయితే 40-45 శాతానికి మాత్రమే చేరుకోగలుగుతుంది...
 

అదీ కాకుండా ఇంగ్లాండ్‌ జట్టుకి డీ మెరిట్ పాయింట్లు చేరడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా 10 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌తో కలిసి 12 డీ మెరిట్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. భారత జట్టుకి 3, వెస్టిండీస్‌కి 2 డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 5 విజయాలు, 3 డ్రాలతో 75 శాతం విజయాలతో టేబుల్ టాప్‌‌లో ఉంది. టీమిండియాపై సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా 5 విజయాలు, 2 పరాజయాలతో 71.43 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. 

డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో 6 విజయాలు, 3 పరాజయాలు, 2 డ్రాలను అందుకున్న భారత జట్టు మూడో స్థానంలో ఉంది. జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ఫలితం భారత జట్టు, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశాలను నిర్ణయించనుంది...

ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కూడా ఈసారి డబ్ల్యూటీసీలో విజయాలు అందుకోవడానికి కష్టపడుతుండడం విశేషం. ఈ సీజన్‌లో 2 విజయాలు అందుకున్న న్యూజిలాండ్, 5 మ్యాచుల్లో ఓడింది. ఒక్క మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది...

శ్రీలంక జట్టు 55.56 విజయాల శాతంలో నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ 52.38 విజయాల శాతంతో ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ 35.71, న్యూజిలాండ్ 29.17, ఇంగ్లాండ్ 23.81, బంగ్లాదేశ్ 16.67 శాతం విజయాలతో తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?