Yashasvi Jaiswal: కేన్ విలియమ్సన్, పాతుమ్ నిస్సాంక వంటి స్టార్ ప్లేయర్లను వెనక్కినెట్టి టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. ఇటీవల భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో 2 డబుల్ సెంచరీలు బాదిన జైస్వాల్ ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ICC Player of the Month award: టీమిండియా రైజింగ్ స్టార్ యశస్వి జైస్వాల్ క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇటీవల ముగిసిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారించి.. అనేక రికార్డులు సృష్టించాడు. జైస్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి ఇంగ్లాండ్ బౌలింగ్ ఉతికిపారేశాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు సాధించిన యంగ్ ప్లేయర్ గా రికార్డు బద్దలు కొట్టాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు (712 రన్స్) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అద్భుతమైన ఆటతో ముందుకు సాగుతున్న యశస్వి జైస్వాల్ ను తాజా ఐసీసీ అవార్డు వరించింది. ఫిబ్రవరి నెలకు గానూ జైస్వాల్ ను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఐసీసీ ఎంపిక చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం జైస్వాల్‌తో పాటు కేన్ విలియమ్సన్, పాతుమ్ నిస్సాంకలు కూడా పోటీ పడ్డారు. ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఐసీసీ నామినేట్ చేసింది. అయితే, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంకలను వెనక్కినెట్టిన జైస్వాల్ ఐసీసీ అవార్డుకు ఎంపికయ్యాడు.
T20 WORLD CUP 2024: టీమిండియాకు బిగ్ షాక్ ! వన్డే ప్రపంచకప్ హీరో టోర్నీ నుంచి ఔట్ !
జైస్వాల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించగలడని అతని గణాంకాలు చెబుతున్నాయని ఐసీసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. ఫిబ్రవరి నెలలో ఇంగ్లండ్‌పై వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లలో రెండు అద్భుతమైన డబుల్ సెంచరీలు సాధించాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసి, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.
డబుల్ సెంచరీలు మాత్రమే కాదు ఫిబ్రవరిలో జైస్వాల్ అనేక రికార్డులు సృష్టించాడు. రాజ్‌కోట్‌లో తన ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టడం ద్వారా ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో వసీం అక్రమ్ కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేశాడు. అలాగే, జైస్వాల్ 22 ఏళ్ల 49 రోజుల వయసులో వరుసగా డబుల్ సెంచరీలు చేయడం ద్వారా సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, భారత ఆటగాడు వినోద్ కాంబ్లీలను సమం చేశాడు. ఫిబ్రవరిలో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో జైస్వాల్ 20 సిక్సర్ల సాయంతో మొత్తం 560 పరుగులు చేశాడు. దీనితో పాటు, మార్చిలో అతను తన టెస్ట్ కెరీర్‌లో 1000 పరుగులు కూడా పూర్తిచేశాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి విరాట్ కోహ్లీ ఔట్.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్ !