T20 World Cup 2024: వన్డే ప్రపంచ కప్ 2023లో గాయం కారణంగా మహ్మద్ షమీ భారత జట్టుకు దూరం అయ్యాడు. ఇటీవల లండన్ లో శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పారు.
Mohammed Shami: మరో మెగా క్రికెట్ టోర్నమెంట్ కు ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది వన్డే ప్రపంచ కప్ 2024 టోర్నీ జరగ్గా, ఈ ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్‌లలో జరగనున్న ఈ మేగా క్రికెట్ టోర్నమెంట్ కు మే మొదటి వారంలోగా జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించే అవకాశముంది. అయితే, జట్ల ప్రకటనలకు ముందే టీమిండియాకకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు.
వన్డే వరల్డ్ కప్ 2023 హీరో మహ్మద్ షమీ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు దూరం అయ్యాడు. పీటీఐ నివేదికల ప్రకారం.. టీమిండియా స్టార్ బౌలర్, వన్డే ప్రపంచకప్ హీరో షమీ వచ్చే టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌తో మళ్లీ షమీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు. బీసీసీఐ సెక్రటరీ జై షాను ఉద్దేశించి పీటీఐ పేర్కొంది.
20 వరల్డ్ కప్ 2024 నుంచి విరాట్ కోహ్లీ ఔట్.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్ !
గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న షమీ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం అవసరం. దీంతో షమీ బంగ్లాదేశ్ సిరీస్‌లో మాత్రమే పునరాగమనం చేయగలడని జైషా చెప్పినట్టు పీటీఐ పేర్కొంది. ఇక భారత జట్టు సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే షమీ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. షమీ మొత్తం టోర్నీ నుంచి తప్పుకుంటాడని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ కు దూరం కావడంతో టీమిండియాకు ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
కాగా, మహ్మద్ షమీ భారత్‌లో అత్యుత్తమ బౌలర్. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే, గాయం కారణంగా ప్రపంచ కప్ తర్వాత ఎలాంటి సిరీస్ లలో కూడా ఆడలేదు. ఇంగ్లాండ్ తో భారత్ ఆడిన టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు కానీ, గాయం తీవ్రత తగ్గకపోవడంతో అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలోనే లండన్ లో కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
IPL 2024: ధోని టీమ్ టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే.. ! ఐపీఎల్ టిక్కెట్ల బుకింగ్, ధర ఎంతో తెలుసా?