ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం.. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తు, అగ్రస్థానానికి టీమిండియా

By Siva Kodati  |  First Published Dec 17, 2023, 10:16 PM IST

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.  ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగడానికి ముందు అగ్రస్థానంలో వున్న పాకిస్తాన్ ఇప్పుడు 66.67 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఒకదానిలో ఓడిపోయింది. 


ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 360 పరుగుల భారీ తేడాతో పాక్ ఘోర ఓటమి పాలైంది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగడానికి ముందు అగ్రస్థానంలో వున్న పాకిస్తాన్ ఇప్పుడు 66.67 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఒకదానిలో ఓడిపోయింది. 

ఇక భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌లో గెలుపొంది మరో మ్యాచ్ డ్రా చేసుకుంది. టీమిండియా కూడా 66.67 శాతంతో పాక్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు.. పాక్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అరుదైన ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టి.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. 500 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్లలో షేన్ వార్న్ (708 వికెట్లు), మెక్‌గ్రాత్ (563)లు వున్నారు. 

Latest Videos

click me!