South Africa vs India : తొలి వన్డేలో భారత్ ఘన విజయం .. చిత్తుగా ఓడిన సఫారీలు

By Siva Kodati  |  First Published Dec 17, 2023, 6:00 PM IST

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇవాళ జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 


దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇవాళ జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52), సాయి సుదర్శన్ (55) అర్థ శతకాలతో రాణించారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల దెబ్బకు పేక మేడలా కుప్పకూలింది. కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. సఫారీ జట్టులో టోనీ డీ జోర్జీ 28, పేలుక్వాయో 33 పరుగులు చేయడంతో ఆ జట్టు కనీసం 100 పరుగులైనా దాటగలిగింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Latest Videos

undefined

అయితే రెండో ఓవర్‌లోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. అర్షదీప్ బౌలింగ్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే వాండర్ డసెన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే మార్‌క్రమ్ , జోర్జిలు ప్రమాదకరంగా మారుతున్న దశలో మరోసారి అర్ష్‌దీప్ మ్యాజిక్ చేశాడు. ఓపెనర్ జోర్జి భారీ షాట్ కొట్టబోయి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్లాసెన్‌ను కూడా అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 

ఆ వెంటనే క్రమం తప్పకుండా దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. ఆవేశ్‌ఖాన్ వరుస బంతుల్లో ముల్లర్, మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్‌లను ఔట్ చేశాడు. అయితే చివరిలో ఫెలుక్వాయో దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా 100 పరుగుల మార్క్‌ను దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఫెలుక్వాయోను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 25.1 ఓవర్లో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. చివరికి 27.3 ఓవర్‌లో దక్షిణాఫ్రికా  ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 5, ఆవేశ్ ఖాన్ 4, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 
 

click me!