South Africa vs India : 5 వికెట్లు తీసి సఫారీలను వణికించిన అర్ష్‌దీప్ సింగ్ .. తొలి పేసర్‌గా అరుదైన రికార్డు

By Siva KodatiFirst Published Dec 17, 2023, 7:21 PM IST
Highlights

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి సఫారీలు 116 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముఖ్యంగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (5/37) అద్భుత ప్రదర్శన చేశాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి సఫారీలు 116 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముఖ్యంగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (5/37) అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా అతను అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికట్ల ప్రదర్శన చేసిన తొలి భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఆ జట్టుపై భారత స్పిన్నర్లే ఐదు వికెట్లు తీశారు. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు మంచి గణాంకాలు నమోదు చేయలేకపోయానని అన్నాడు. కానీ ఈ సారి మాత్రం తనకు ఆ అవకాశం వచ్చిందని అర్ష్‌దీప్ తెలిపాడు. పిచ్ నుంచి చాలా సహకారం దొరికిందని, మ్యాచ్‌కు ముందు పిచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్దగా మూవ్‌మెంట్ వుండదని అనుకున్నామని ఆయన పేర్కొన్నాడు. స్వింగ్‌కు పిచ్ బాగా అనుకూలంగా మారిందని, దీంతో వికెట్ టు వికెట్ బంతులను సంధించామని అర్ష్‌దీప్ అన్నాడు. చాలా రోజుల తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ఆడానని , ఎక్కడా ఇబ్బంది పడకుండా ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం కొత్త ఉత్సాహాన్నిస్తోందని వ్యాఖ్యానించాడు. 

Latest Videos

కాగా.. ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లను టీమిండియా పేసర్లు తీయడం ఇదే తొలిసారి. గతంలో 1993లో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో 9, 2013లోసెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లను పడగొట్టారు. ఇకపోతే.. దక్షిణాఫ్రికాపై గతంలో సునీల్ జోషి, చాహల్, రవీంద్ర జడేజాలు గతంలో దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్లు తీశారు. ఇక దక్షిణాఫ్రికా 150 లోపే ఆలౌట్ కావడం ఇది రెండోసారి . గతంలో 2018లో సెంచూరియన్‌లో 118 పరుగులకే ఆలౌట్ కాగా.. తాజా మ్యాచ్‌లో 116 పరుగులకే ఆలౌటైంది. 

click me!