ఆగు.. కోహ్లీకి చెబుతాం: చాహల్‌కు రోహిత్, బుమ్రా స్వీట్ వార్నింగ్

By Siva Kodati  |  First Published Apr 6, 2020, 8:01 PM IST

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లకు మరో పని లేకపోవడంతో వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.


టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లకు మరో పని లేకపోవడంతో వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ వీడియో చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2020 ప్రణాళికలు, టీవీ కార్యక్రమాలు, వంటలు తదితర అంశాలపై ముచ్చటించుకున్నారు.

Latest Videos

undefined

వీరి చాట్‌ను వీక్షించిన యజువేంద్ర చాహల్ వరుసగా కామెంట్లు చేశాడు. దీంతో రోహిత్... చాహల్‌ను లైవ్ వీడియోలోకి అనుమతించాడు. ఈ సందర్భంగా చాహల్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ తననేమైనా మిస్సవుతుందా అని అడిగాడు.

Also Read:కరోనాపై బుడతడి సలహాలు: సెహ్వాగ్ ఫిదా.. అందరూ పాటించాలని ట్వీట్

ఇందుకు స్పందించిన రోహిత్, బుమ్రాలు చాహల్‌ను ఆటపట్టించారు. అతనడిగిన ప్రశ్నను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి చెప్పడంతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

దీనిని బట్టి చాహల్‌కు ముంబైకి తిరిగి రావాలనుకుంటున్నాడు అని బుమ్రా నవ్వాడు. అనంతరం రోహిత్ స్పందిస్తూ.. ఒకవేళ మనం గెలవకపోతే, చాహల్‌ను మిస్సయ్యేవాళ్లం. కానీ మనం గెలుస్తున్నాం, అప్పుడెందుకు మిస్సవుతాం. చాహల్, నువ్వు బెంగళూరులోనే ఉండు... నీకదే మంచిదని రోహిత్ చమత్కరించాడు.

2013లో ముంబై ఇండియన్స్ తరపున ఒకే మ్యాచ్ ఆడిన చాహల్‌ను 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 12 వికెట్లతో ఆకట్టుకోవడంతో టీమిండియా స్పిన్నర్ ఆర్‌సీబీకి శాశ్వత ఆటగాడికి మారిపోయాడు.

Also Read:2011 వరల్డ్ కప్ ఫైనల్‌ ఘటన.. అది మాస్టర్ స్కెచ్: సెహ్వాగ్

బెంగళూరు తరపున 83 మ్యాచ్‌లు ఆడగా 99 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్‌ మార్చి 29 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది.

కరోనా కారణంగా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ 2020 జరిగే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 

click me!