వంటగాడి మారిన టీమిండియా మాజీ హెడ్ కోచ్..? ఇంతకీ ఏం వండుతున్నాడో..?

Published : Dec 21, 2021, 12:04 PM ISTUpdated : Dec 21, 2021, 12:06 PM IST
వంటగాడి మారిన టీమిండియా మాజీ హెడ్ కోచ్..? ఇంతకీ ఏం వండుతున్నాడో..?

సారాంశం

Ravi Shastri: భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. టీమిండియా దక్షిణాఫ్రికా సిరీస్ ముందు అతడు చెఫ్ అవతారమెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నది. 

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడా..? కోచ్ గా పదవీ కాలం ముగిసిన్పట్నుంచి రవిశాస్త్రి తర్వాత అడుగులు ఎటువైపు అని భారత క్రికెట్ ఫ్యాన్స్  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతడు ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్  కు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించున్నాడని.. కాదు, మళ్లీ అతడు మైక్ పట్టుకుని కామెంటేటర్ గా పాత పనిలోకే  మారనున్నాడని  పలు వార్తలు వచ్చాయి. అయితేదీనిపై ఇంతవరకూ రవిశాస్త్రి ఏ ప్రకటనా చేయలేదు. కానీ.. తాజాగా శాస్త్రి చెఫ్ అవతారమెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నది. 

స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఒక వీడియోలో రవిశాస్త్రి వంటవాడి అవతారమెత్తాడు.  ఈ వీడియోలో శాస్త్రి.. చెఫ్ బట్టలు వేసుకుని  ఏదో వంట చేస్తున్నట్టు కనిపించాడు. ఓ బౌల్ నుంచి సూప్ ను తీసి టేస్ట్ చేసిన రవిశాస్త్రి.. సూపర్ ఉందంటూ చూపించాడు.  

ఆ తర్వాత   ఆ సూప్ ను ఒక గిన్నెలో పోసుకుని  కిచెన్ నుంచి వెళ్లిపోయాడు.  17  సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. చివర్లో.. ‘సమ్థింగ్ ఈజ్ కుకింగ్..’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో కూడా పంచుకుంది. 

 

కాగా..  భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో రవిశాస్త్రి తిరిగి మైక్ పట్టనున్నాడని సమాచారం. ఇందులో భాగంగానే ఈ ప్రోమోను విడుదల చేశారని టాక్ వినిపిస్తున్నది. స్టార్ స్పోర్ట్స్ కూడా తన ప్రోమోలో.. ‘సమ్థింగ్ ఈజ్ కుకింగ్.. అదేంటో కనుక్కోండి..?’ అంటూ  హింట్ ఇవ్వడం కూడా  ఈ  వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నది. ఈనెల 26 నుంచి సెంచూరీయన్ వేదికగా  దక్షిణాఫ్రికా తో తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 

 

ప్రస్తుతానికి శాస్త్రి.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) కు కమిషనర్ గా ఉన్నాడు. అంతేగాక స్పోర్టింగ్ బియాండ్ అనే స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా ప్రారంభించాడు.  ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన ఇన్సైడ్ ఎడ్జ్  సీజన్ 3ను ప్రమోట్  చేసినప్పుడు కూడా శాస్త్రి అతిథి పాత్రలో కనిపించాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !