‘నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి... ఎందుకంటే’... కింగ్స్ ఎలెవన్ కోచ్ వసీం జాఫర్‌ మరో ఫన్నీ పోస్టు...

Published : Feb 02, 2021, 10:20 AM IST
‘నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి... ఎందుకంటే’... కింగ్స్ ఎలెవన్ కోచ్ వసీం జాఫర్‌ మరో ఫన్నీ పోస్టు...

సారాంశం

ట్విట్టర్‌లో 2 లక్షల ఫాలోవర్ల మార్కును అధిగమించిన వసీం జాఫర్... మీమీలతో సోషల్ మీడియా ఫాలోవర్లకు వినోదాన్ని పంచుతున్న మాజీ క్రికెటర్... మాజీ క్రికెటర్‌గా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా కంటే మీమీ క్రియేటర్‌గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న జాఫర్...

భారత మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్‌కి ట్విట్టర్‌లో 2 లక్షల ఫాలోవర్లు వచ్చారు. నిత్యం ఫన్నీ ఫన్నీ పోస్టులతో, మీమీలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు వసీం జాఫర్. జాఫర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ టైమింగ్, మీమీ క్రియేషన్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు...

ఫజిల్స్‌తో ఆస్ట్రేలియా టూర్‌లో అజింకా రహానేకి సలహాలు ఇచ్చిన వసీం జాఫర్, భారత జట్టు ప్రతీ మూమెంట్‌ను అభినందిస్తూ, చమత్కరిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. తనకి 200K ఫాలోవర్లు వచ్చిన సందర్భంగా ట్విట్టర్‌‌లో ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశారు వసీం జాఫర్...

‘మన ట్విట్టర్ ఫ్యామిలీ 200K అంత బలంగా మారింది. అందరికీ థ్యాంక్స్.. ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్న చాలామంది ఉన్నారు’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు వసీం జాఫర్.. అయితే ఆ వీడియోలో ‘నాకు నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా... ఎందుకంటే’ అంటూ అమెరికన్ ర్యాపర్ స్నూప్ డాగ్ ఇస్తున్న ప్రసంగం ఉంది.

 

వసీం జాఫర్‌కి ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో పాటు విదేశాల్లోనూ ఫాలోవర్లు ఉన్నారు. మీకు 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నా తక్కువేనంటూ కామెంట్లు చేస్తున్నారు వసీం జాఫర్ మీమీ ఫ్యాన్స్.

PREV
click me!

Recommended Stories

IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !