
భారత జట్టు ఇంగ్లాండ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేసుకున్న భారత క్రికెట్ జట్టు సభ్యులు... నేటి నుంచి అవుట్ డోర్ సెషన్స్‌లో పాల్గొనబోతున్నారు. రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా సహా పలువురు క్రికెటర్లు కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు...
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన ప్లేయర్లు అందరికీ మూడో సారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరూ నెగిటివ్‌గా తేలడంతో రేపటి నుంచి నెట్ ప్రాక్టీస్ మొదలెట్టబోతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టు సిరీస్‌లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి రెండు టెస్టులు ఆడనుంది భారత జట్టు.
ఈ రెండు మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతి ఉండదు. అయితే మొతేరా స్టేడియంలో జరిగే మూడో, నాలుగో టెస్టుకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్రం అనుమతించింది. శ్రీలంక నుంచి ఇండియాకు చేరుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా క్వారంటైన్ పూర్తి చేసుకుని, రేపటి నుంచి నెట్‌ప్రాక్టీస్‌లో పాల్గొనబోతున్నారు.
ఇంగ్లాండ్ నుంచి నేరుగా ఇండియాకి వచ్చిన బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్... ఇప్పటికే నెట్ ప్రాక్టీస్‌లో తెగ బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియా టూర్‌కి దూరమైన ఇషాంత్ శర్మ, టెస్టు సిరీస్ ఆడని హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, పెటర్నిటీ లీవ్ ద్వారా మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ, ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.