24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ చేరిన టీమిండియా .. నెక్స్ట్ ఎవరితో తలపడనుంది?

By Mahesh Rajamoni  |  First Published Jun 25, 2024, 12:16 AM IST

IND vs AUS : బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్-కుల్దీప్ యాద‌వ్ అద‌ర‌గొట్టారు. దీంతో భార‌త జ‌ట్టు 24 ప‌రుగుల తేడాతో ఆసీస్ జ‌ట్టును ఓడించి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. 
 


IND vs AUS T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 సూపర్-8 మ్యాచ్ లో భారత జ‌ట్టు 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ స‌మిష్టిగా రాణించింది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్-కుల్దీప్ యాద‌వ్ అద‌ర‌గొట్టారు. దీంతో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యంతో టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో సెమీ ఫైన‌ల్ లో అడుగుపెట్టింది.  సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగులు చేసింది. ఆసీస్ జ‌ట్టు లక్ష్య ఛేద‌న‌లో భార‌త బౌల‌ర్లు రాణించ‌డంతో 7 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఈ విజయంతో గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. సూపర్ 8 గ్రూప్ 1లో వ‌రుస విజ‌యాల‌తో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు జూన్ 27న జరిగే సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. చివరిసారి కూడా ఈ మ్యాచ్ ఇరు జట్ల మధ్య జరిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కన్నేసింది.

Latest Videos

undefined

టీ20 నెంబర్.1 ప్లేయర్ గా రోహిత్ శర్మ.. కోహ్లీని అధిగమిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు

కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ శర్మ ధాటికి భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ 41 బంతుల్లో 92 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. హిట్ మ్యాన్ 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాదాడు.  సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు, శివమ్ దూబే 28 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు చొప్పున వికెట్లు తీశారు.

206 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన ఆస్ట్రేలియాకు మంచి శుభారంభం ల‌భించింది. ఆసీస్ త‌ర‌ఫున‌ ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, వ‌న్డే ప్రపంచకప్ ఫైనల్ 2023లో సెంచరీలు బాది భార‌త్ క‌ల‌ను చెద‌ర‌గొట్టాడు. కానీ భార‌త బౌల‌ర్ల ముందు ఈసారి అదే ఫీట్‌ను ప్రదర్శించలేకపోయాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా కీల‌క‌మైన ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు.

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. రికార్డుల మోత మోగించాడు

 

𝙎𝙚𝙢𝙞-𝙛𝙞𝙣𝙖𝙡𝙨 ✅ ✅

𝘼 𝙎𝙪𝙥𝙚𝙧(𝙗) 𝙒𝙞𝙣! 🙌

Make that 3⃣ victories in a row in the Super Eight for as they beat Australia by 24 runs! 👏👏 | pic.twitter.com/LNA58vqWMQ

— BCCI (@BCCI)

 

సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. గ్రూప్ 1లో భారత్ 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లకు 2 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్‌లో చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ జట్టు గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఆస్ట్రేలియా కోరుకుంటోంది. ఇది కాకుండా, బంగ్లాదేశ్ జట్టు 61 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిస్తే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లను దాటేసి సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక చివరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

6, 6, 6, 6.. రోహిత్ శ‌ర్మ సిక్స‌ర్ల వ‌ర్షం.. ఆస్ట్రేలియాకు కు దిమ్మ‌దిరిగే షాక్.. !


 

click me!