Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంటూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ 2024 లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.
IND vs AUS : సరిగ్గా ఇదే రోజు 17 ఏళ్ల కిందట ఐర్లాండ్ పై అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు క్రికెట్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 లో సునామీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. వరుస సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతో టీ20 ప్రపంచ కప్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఒక్క పరుగు చేయకుండానే విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన బ్యాట్ పవర్ ను చూపించాడు. వెస్టిండీస్ లో హిట్ మ్యాన్ సిక్సర్ల షో చూపించాడు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపిస్తూ వరుస సిక్సర్లతో పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రికార్డుల మోత మోగించాడు. కేవలం 14 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ కు కాస్త అంతరాయం ఏర్పడింది. అప్పటికే హిట్ మ్యాన్ 2 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.
ఐసీసీ గ్రౌండ్ లో గల్లీ సీన్.. విరాట్ కోహ్లీ చేసిన పనికి నెట్టింట కామెంట్ల వర్షం.. రోహిత్ కూడా..
స్టార్క్ వేసిన బౌలింగ్ లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ తో 29 పరుగులు రాబట్టాడు. తర్వాత కూడా ఆస్ట్రేలియా ఇతర ఆటగాళ్ల బౌలింగ్ ను కూడా ఉతికి పారేశాడు. వర్షం తగ్గి మ్యాచ్ ప్రారంభం కావడంతో రిషబ్ పంత్ తో కలిసి మళ్లీ తన బ్యాట్ సునామీని కొనసాగించాడు. మళ్లీ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది టీ20 ప్రపంచ కప్ 204 లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే, ఆ స్ట్రేలియాపై రోహిత్ శర్మ 8 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. 41 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
టీ20 ప్రపంచ కప్ 2024 లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు ఇవే
1. 19 బంతుల్లో రోహిత్ శర్మ (ఇండియా vs ఆస్ట్రేలియా)
2. 22 బంతుల్లో ఆరోన్ జోన్స్ (అమెరికా vs కెనడా)
3. 22 బంతుల్లో క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్)
4. 24 బంతుల్లో ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా vs భారత్)
5. 25 బంతుల్లో మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్)
6. 26 బంతుల్లో షాయ్ హోప్ (వెస్టిండీస్ vs యూఎస్ఏ )
A Spectacular Knock 👏
Captain Rohit Sharma departs after a sensational and stroke-filled 92(41) reach 155/3 after 14 overs
Follow The Match ▶️ https://t.co/L78hMho6Te | |
📸 ICC pic.twitter.com/JmeggrehCY
6, 6, 6, 6.. రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ఆస్ట్రేలియాకు కు దిమ్మదిరిగే షాక్.. !