ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ ఫ్లైట్ ఏ ఆటగాడైనా ఎక్కొచ్చు: రవిశాస్త్రి సంచలనం

Published : May 15, 2019, 06:43 PM IST
ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ ఫ్లైట్ ఏ ఆటగాడైనా ఎక్కొచ్చు: రవిశాస్త్రి సంచలనం

సారాంశం

మరికొద్దిరోజుల్లో వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు కొనసాగిన ఐపిఎల్ ఫీవర్ ఇప్పుడు వరల్డ్ కప్ వైపు మళ్లింది. అయితే ఈ ఐపిఎల్ సీజన్ 12 రెండు నెలల పాటు భారత క్రికెట్ అభిమానులకు మజాను పంచినా ఇప్పుడు మాత్రం ఆందోళనను కలిగిస్తోంది. ప్రపంచ కప్ ఎంపికైన భారత ఆటగాడు కేదార్ జాదవ్ గాయం, కుల్దీప్ యాదవ్ ఫామ్ లేమి ఈ ఆందోళనకు కారణమవుతోంది. దీనికి తోడు తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ కామెంట్ మరింత గందరగోళానికి కారణమయ్యింది.

ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ నెల 22న టీమిండియా జట్టు ఇంగ్లాండ్ కు బయలుదేరనుందని...ఆ ఫ్లైట్ లో ఎవరుంటే వారే ప్రపంచ కప్ ఆడనున్నట్లు తెలిపారు. కేదార్ జాదవ్ గాయం, కుల్దీప్ యాదవ్ ఫామ్ గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గానీ ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. 

 కేదార్ జాదవ్ గాయం నుండి కోలుకుంటాడని  తనకు నమ్మకుందని, అదృష్టవశాత్తు అతడికి  ఫ్రాక్చర్‌ కాలేదని రవిశాస్త్రి అన్నారు.  కానీ ఇంకా ఆ గాయం తగ్గకపోవడంతో కొన్ని రోజుల పాటు పరిశీలనలో ఉంచుతున్నామని... అప్పటికీ  పరిస్థితి ఇలాగే  వుంటే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామన్నారు. ఇప్పటికైతే అలాంటి వాటి గురించి ఆలోచించడం లేదన్నారు.  అలాగే కుల్దీప్ ఫామ్ పై కూడా ఇప్పటికైతే ఎలాంటి ఆందోళన లేదని అన్నారు. 

ప్రస్తుతం  ప్రపంచ కప్ కు ఎంపికైన ఆటగాళ్లు ఎలా వున్నారన్నది తమకు అనవసరమన్నారు. ఇంగ్లాండ్ కు బయలుదేరే సమయానికి ఫిట్ గా ఎవరున్నారన్నదే తమకు కావాలని స్పష్టం చేశారు. అప్పుడే టీమిండియా తరపున ప్రపంచ కప్ ఆడే ఆటగాళ్లెవరో స్పష్టత  వస్తుందని పేర్కొన్నారు. గాయాలు, ఇతర కారణాలతో ఈ మెగా టోర్నీకి ఎవరు దూరమైనా వారి స్థానాలను సమర్థవంతంగా భర్తీ చేసే ఆటగాళ్లు భారత జట్టులో వున్నారని రవిశాస్త్రి  ధీమా  వ్యక్తం చేశారు.  

PREV
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?