ప్రతి ప్రపంచ కప్ జట్టుపై ప్రత్యేక నిఘా...ఐసిసి సంచలన నిర్ణయం

By Arun Kumar PFirst Published May 15, 2019, 4:37 PM IST
Highlights

క్రికెట్ మ్యాచ్ అంటే గతంలో ఓ క్రీడ మాత్రమే. కానీ ఇప్పుడు అదో వందలు, వేల కోట్లతో చేసే వ్యాపారంగా  మారింది. ఇలా భారీ డబ్బులతో ముడిపడిన అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, బోర్డు సభ్యులు తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడటం, క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే బుకీలకు  అనుకూలంగా వ్యవహరిస్తూ క్రీడాస్పూర్తిని గాలికొదిలేస్తూ కొందరు  భారీ  అవినీతికి పాల్పడుతున్నారు.వీటన్నింటిన గమనిస్తున్న ఐసిసి(ఇంటర్నేషన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ 2019 మెగా టోర్నమెంట్ లో ఇలాంటి అవకతవకలు జరక్కుండా వుండేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 

కెట్ మ్యాచ్ అంటే గతంలో ఓ క్రీడ మాత్రమే. కానీ ఇప్పుడు అదో వందలు, వేల కోట్లతో చేసే వ్యాపారంగా  మారింది. ఇలా భారీ డబ్బులతో ముడిపడిన అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, బోర్డు సభ్యులు తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడటం, క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే బుకీలకు  అనుకూలంగా వ్యవహరిస్తూ క్రీడాస్పూర్తిని గాలికొదిలేస్తూ కొందరు  భారీ  అవినీతికి పాల్పడుతున్నారు.వీటన్నింటిన గమనిస్తున్న ఐసిసి(ఇంటర్నేషన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ 2019 మెగా టోర్నమెంట్ లో ఇలాంటి అవకతవకలు జరక్కుండా వుండేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గనే ప్రతి జట్టు వెంట ఓ అవినీతి నిరోధక  అధికారి(ఏసియూ) వుండేలా చర్యలు తీసుకున్నట్లు ఐసిసి ప్రకటించింది. ఇలా ప్రపంచ కప్ లో పాల్గొనే పది  జట్ల వెంట  పదిమంది అధికారులు వుంటారన్నమాట. వీరు వార్మప్ మ్యాచులు మొదలుకొని ప్రపంచ కప్ టోర్నీ ముగిసి స్వదేశాలకు వెళ్లిపోయేవరకు  ఆయా జట్ల వెంట వుంటూ ఆటగాళ్లు, సిబ్బందిపై నిఘా  వుంచనున్నట్లు ఐసిసి వెల్లడించింది. 

గతంలోనూ ఇలా ఏసియూ అధికారుల నిఘా జట్లపై, ఆటగాళ్ల కదలికలపై వుండేది. కానీ ఇలా ప్రత్యేకంగా ఓ అధికారితో ఎల్లపుడూ నిఘా వుండేది కాదు. అలాకాకుండా నిత్యం  ఓ అవినీతి నిరోధక అధికారి జట్టు వెంట వుండేలా ఐసిసి చర్యలు  తీసుకుంది. 

'' ఆటగాళ్లు బసచేసే హోటల్లోనే సదరు అధికారికి  బస ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా హోటల్లోనే కాకుండా  మైదానంలోనూ, వివిధ కార్యక్రమాల్లోనూ అతడు ఆటగాళ్ల వెన్నంటే వుంటాడు. ఈ సమయంలో  అతడికి ఏదైనా అనుమానం కలిగితే  వెంటనే  ఐసిసికి సమాచారం అందించడంతో పాటు తన అధికారాలకు లోబడి చర్యలు తీసుకుంటాడు.'' అని ఓ ఐసిసి అధికారి తెలిపారు.   

click me!