పంత్ కంటే దినేశ్ కార్తిక్ ఏ విషయంలో మెరుగంటే: విరాట్ కోహ్లీ

By Arun Kumar PFirst Published May 15, 2019, 5:28 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా  మరికొద్దిరోజుల్లో ఐసిసి  వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నీకోసం ఎంపికచేసిన భారత జట్టును కొద్దిరోజుల క్రితమే బిసిసిఐ ప్రకటించారు. అయితే ఆ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్, అంబటి రాయుడికి సెలెక్టర్లు చోటు కల్పించకపోవడం వివాదానికి దారితీసింది. అప్పటితో ఆ వివాదం సద్దుమణిగినా ఐపిఎల్లో పంత్ అద్భుతంగా రాణించడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. గంగూలీ, పాంటింగ్ వంటి మాజీలు డిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న పంత్ ని భారత్ ప్రపంచకప్ కోసం ఎంపికచేయకపోవడాన్ని తప్పుబట్టారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. 

''రిషబ్  పంత్ మంచి టాలెంటెడ్ ఆటగాడైన అనుభవం చాలా తక్కువ. ప్రపంచ కప్  వంటి అంతర్జాతీయ  టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకొని  ఆడటం చాలా ముఖ్యం. ఈ  విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే పంత్ కంటే అనుభజ్ఞుడైన దినేశ్ కార్తిక్ ఎంపికే కరెక్టని భావించాం. సెలెక్షన్ కమీటీలోని ప్రతి ఒక్కరు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపర్చడంతో పంత్ ను పక్కనబెట్టి కార్తిక్ ను ఎంపిక చేయడం జరిగింది. 

అంతేకాకుండా ధోనికి ప్రత్యామ్నాయంగా వీరిద్దరి పేర్లను పరిశీలించాం. కాబట్టి ధోని ఏదైనా కారణాలతో జట్టుకు దూరమైతేనే ఆ స్థానంలో కార్తిక్ ఆడనున్నాడు. కాబట్టి  ధోని లాగే వికెట్ కీపర్, బ్యాట్ మెన్, మంచి మ్యాచ్ ఫినిషర్ గా కార్తిక్ పనికొస్తాడు. అలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్న  సందర్భాలు పంత్ కి చాలా తక్కువ. కాబట్టి అన్నిరకాలుగా  ఆలోచించే కార్తిన్ ను ఎంపిక చేశాం'' అని కోహ్లీ వివరించాడు.  

click me!