డివిలియర్స్‌ పునరాగమనంపై విమర్శలు: కోహ్లీ, అనుష్క మద్ధతు

By Siva KodatiFirst Published Jul 14, 2019, 11:35 AM IST
Highlights

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మరోసారి పునరాగమనం చేస్తానంటున్న దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు డివిలియర్స్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మరోసారి పునరాగమనం చేస్తానంటున్న దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు డివిలియర్స్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. రిటైర్మెంట్ తర్వాత కేవలం డబ్బు కోసమే డివిలియర్స్ వివిధ లీగుల్లో ఆడుతున్నాడని అతనిపై మాజీలు, అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

దీనిపై స్పందించిన ఏబీ తాను ప్రపంచకప్‌లో ఆడాలని డిమాండ్, ఒత్తిడి ఏమి చేయలేదని.. కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో డివిలియర్స్‌కు మద్ధతుగా నిలిచిన కోహ్లీ.. నువ్వు నిజాయతీపరుడివని తెలుసు.. నీ మీద మాకు నమ్మకముందని పేర్కొన్నాడు.

అనుకోకుండా నీ మీద ఇలాంటి అపనిందలు వచ్చాయి. మేమంతా నీవెంటే ఉంటామని.. నీ వ్యక్తిగత విషయాల్లో వారు తలదూరుస్తున్నందుకు బాధగా ఉందని.. నీకు, నీ కుటుంబానికి తాను, అనుష్క ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోహ్లీ తెలిపాడు.

మరోవైపు డివిలియర్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా అండగా నిలిచాడు. నువ్వు అత్యుత్తమ క్రికెటర్‌వి.. వ్యక్తిగతంగా నువ్వు అద్బుతం.. నువ్వు లేకుండా ప్రపంచకప్‌ సాధించడం అసాధ్యం.

నువ్వు జట్టులో లేనందుకు మీ దేశమే నష్టపోయిందని... కీలక ఆటగాళ్లపై విమర్శలు ఎక్కువని... నీవు నిజాయితీపరుడివని మా అందరికీ తెలుసునని యువీ పేర్కొన్నాడు. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీ, డివిలియర్స్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!