సెహ్వాగ్ భార్య సంతకం పోర్జరీ...బ్యాంకులో రూ.4.5 కోట్ల రుణం

By Arun Kumar PFirst Published Jul 13, 2019, 12:54 PM IST
Highlights

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తి తన సంతకం పోర్జరీకి గురయ్యిందంటూ డిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను, భర్త సెహ్వాగ్ ను మోసం చేయడానికి వ్యాపార భాగస్వాములు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. తన పోర్జరీ సంతకంతో ఏకంగా రూ.4.5కోట్ల రుణాన్ని పొందిన వ్యాపార భాగస్వాములపై పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు ఆర్తి  సెహ్వాగ్ వెల్లడించారు.

డిల్లీ నివాసి అయిన సెహ్వాగ్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత స్థానికంగా ఆగ్రో  సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించాడు.  ఇందులో తన భార్య ఆర్తి తో పాటు మరో ఎనిమిది మందిని భాగస్వామ్యులుగా చేర్చుకున్నాడు. అయితే తన భర్త ఇలా ఆదరించినవారే  ఇప్పుడు తమను మోసం చేయడానికి సిద్దపడినట్లు ఆర్తి ఆరోపిస్తున్నారు.

వ్యాపారంలో ప్రధాన భాగస్వాములమైన తమకు తెలియకుండానే కంపనీ పేరిట రూ.4.5 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం తన భర్త సెహ్వాగ్ పలుకుబడిని కూడా వాడుకున్నట్లు పేర్కొన్నారు. అయితే బ్యాంక్ కు సమర్పించిన పత్రాలపై తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని...దీనిపైనే డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్తి సెహ్వాగ్ పేర్కొన్నారు.

అందువల్ల తమ వ్యాపార భాగస్వాములు తీసుకున్న రుణంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని అన్నారు. ఆర్తి సెహ్వాగ్ తన పిర్యాదులో పేర్కొన్న వారిపై ఐపీసీ   420, 468, 471, 34 సెక్షన్ల కింద కేసు  నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.   
 
click me!