రిటైర్మెంట్ తర్వాత ధోని బిజెపిలోకి: మాజీ కేంద్ర మంత్రి సంజయ్ పాశ్వాన్

By Arun Kumar PFirst Published Jul 13, 2019, 12:20 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. క్రీడా వర్గాల్లోనే కాదు రాజకీయ, సీని వర్గాల్లో కూడా దీనిపై తీవ్ర జరుగుతోంది. తాజాగా ధోని రిటైర్మెంట్ పై మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పాశ్వాన్ స్పందిస్తూ సంచలనానికి తెరతీశారు. 

మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. క్రీడా వర్గాల్లోనే కాదు రాజకీయ, సీని వర్గాల్లో కూడా దీనిపై తీవ్ర జరుగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ గానే  కాకుండా బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గా భారత జట్టుకు ధోని అందించిన సేవలు, విజయాలు దేశప్రజలు ఇంకా మరిచిపోలేదు. అందువల్లే అతడు రిటైర్మెంట్ వార్త వినిపించినప్పుడల్లా వారు ఉలిక్కిపడుతున్నారు... ఎక్కడ ఆ వార్త నిజమేనోమోనని. అయితే తాజాగా ధోని రిటైర్మెంట్ పై మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పాశ్వాన్ స్పందిస్తూ సంచలనానికి తెరతీశారు. 

ధోని ఎప్పుడు రిటైరవుతాడో తెలీదు కానీ ఆ తర్వాత మాత్రం ఏం చేస్తాడో చెప్పగలనని సంజయ్ పేర్కొన్నారు. ఎంతో ఇష్టమైన క్రికెట్ నుండి తప్పుకున్నాక ధోని రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపాడు. కేంద్రంలో అధికారంలో వున్ని బిజెపి(భారతీయ  జనతా పార్టీ)లో చేరడానికి అతడు సిద్దంగా వున్నట్లు పేర్కొన్నాడు.  నరేంద్ర మోదీ సారథ్యంలో అతడు మరో కొత్త ఇన్నింగ్స్ ఆడనున్నాడంటూ సంజయ్ సంచలన ప్రకటన చేశారు. 

పార్టీలో చేరే అంశంపై చాలా కాలంగా బిజెపి అధినాయకత్వం,ధోనికి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.  అయితే ధోని రిటైర్మెంట్ తర్వాతే ధోని చేరిక ఎప్పుడన్నదానిపై క్లారిటీ రానుందని సంజయ్ పాశ్వాన్ తెలిపారు. 

"ఎంఎస్ ధోని నాకు మంచి మిత్రుడు. దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగిన అతడు బిజెపిలో చేరితే బావుంటుందని తన అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్న పార్టీ అధినాయకత్వం కూడా కలిగివుంది. అందువల్లే పార్టీలో చేరాల్సిందిగా అతన్ని ఆహ్వానించాం'' అని సంజయ్ పాశ్వాన్ వెల్లడించారు. 

click me!