టీమిండియా సెలెక్టర్ల పొరపాటు...కోహ్లీ సేనకు ప్రపంచ కప్‌ కష్టాలు: గంగూలీ

By Arun Kumar PFirst Published May 15, 2019, 3:52 PM IST
Highlights

ప్రపంచ కప్ కోసం భారత జట్టును  ఎంపికచేసే విషయంలో సెలెక్షన్ కమిటీ పొరపాట్లు చేసిందని మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోపించారు. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇంగ్లాండ్ వేదికన జరగనున్న ప్రపంచ కప్ 2019 లో టీమిండియాపై ప్రభావం చూపనున్నాయన్నాడు. యువ కిలాడి రిషబ్ పంత్ కు ప్రపంచ కప్ ఆడే అవకాశమివ్వక పోవడం అతిపెద్ద పొరపాటుగా గంగూలీ అభివర్ణించాడు. 

''ఐపిఎల్లో డిల్లీని ప్లేఆఫ్  కు చేర్చడంలో పంత్ పాత్ర మరువలేనిది. జట్టు కష్టాల్లో వున్నపుడు ఒత్తిడిని అదిగమించి అతడు బాధ్యతాయుతంగా ఆడిన సందర్భాలు చాలా  వున్నాయి. డిల్లీ క్యాపిటల్స్ మెంటార్ గా అతడి ఆటతీరును చాలా దగ్గరి నుండి చూశాను. ఇంతటి అద్భుతమైన ఆటగాడిని ప్రపంచ కప్ కు ఎంపికచేయకపోవడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసింది. 

అతడు టీమిండియాతో పాటు ప్రపంచ కప్ ఆడటానికి ఇంగ్లాండ్ కు వెళితే బావుండేదన్నాడు. ఎవరి స్థానంలో జట్టులోకి తీసుకుంటే బావుండేదో చెప్పలేను...కానీ పంత్ వుంటే బావుండేదని మాత్రం చెప్పగలను. తప్పకుండా అతడి   సేవలను కోహ్లీ సేన మిస్ అవుతుంది'' అని గంగూలీ పేర్కొన్నాడు. 

గతంలొనూ ఇదే విషయంపై గంగూలీతో పాటు డిల్లీ కోచ్ రికీ పాంటింగ్ కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు కాకున్నా భవిష్యత్ లో మూడు, నాలుగు వరల్డ్ కప్ లు ఆడే అవకాశం పంత్ కు వస్తుందని వారిద్దరు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అతడు టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా మారడం ఖాయమని జోస్యం చెప్పారు. 

click me!