మరో అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ... ఈసారి క్రికెట్లో కాదు

Published : May 18, 2019, 11:39 AM ISTUpdated : May 18, 2019, 11:46 AM IST
మరో అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ... ఈసారి క్రికెట్లో కాదు

సారాంశం

ఐపిఎల్ లో కెప్టెన్ గా విఫలమైనా టీమిండియా కెప్టెన్ విరాట్  కోహ్లీ క్రేజు ఏమాత్రం తగ్గడంలేదు. దేశ  ప్రజలు ఐపిఎల్ కేవలం సరదాకోసం మాత్రమే...దేశ ప్రతిష్టను కాపాడే అంతర్జాతీయ టోర్నీలే తమకు ముఖ్యమని చాటిచెప్పారు. దీంతో ఐపిఎల్ లో ఆకట్టుకోలేకపోయినా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించి టీమిండియాకు విజయాలు కట్టబెట్టిన కోహ్లీ అంటే అభిమానులు పడిచస్తున్నారు. ఇలా తమ అభిమాన ఆటగాడికి వారంతా కలిసి ఓ అరుదైన  రికార్డును కట్టబెట్టారు.    

విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుంటూ క్రికెట్ కు సంబంధించిన విశేషాలనే కాకుండా వ్యక్తిగత, కుటుంబ విషయాలను కూడా వాటి ద్వారా అభిమానులతో  పంచుకుంటాడు. దీంతో చాలామంది వివిధ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా అతన్ని ఫాలో అవుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన  ఇండియన్ క్రికెటర్ గా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. క్రికెట్ గాడ్ గా పేర్కొనే సచిన్ టెండూల్కర్, కెప్టెన్ కూల్ ధోని, హిట్ మ్యాన్ రోహిత్ కు కూడా సాధ్యంకాని ఫ్యాన్ ఫాలోయింగ్ కోహ్లీకి వుందని  దీని ద్వారానే అర్థమవుతోంది. 

మొత్తంగా సోషల్ మీడియాలో కోహ్లీ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్స్ (10 కోట్లు) కు చేరింది.  ఫేస్ బుక్ లో 37.1 మిలియన్స్ (దాదాపు 3కోట్ల 71 లక్షలు), ఇన్‌స్టాగ్రామ్  లో 33.5 మిలియన్స్ (దాదాపు 3 కోట్ల 35  లక్షలు), ట్విట్టర్ లో 29.4 మిలియన్స్ (2 కోట్ల 94 లక్షలు) ఫాలోవర్స్ ని కోహ్లీ కలిగివున్నాడు. ఇలా  ఓ క్రీడాకారుడికి ఇంత భారీఎత్తున  ఫాలోవర్స్ వుండటం కేవలం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. 

టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్ గా అత్యుత్తమ ఆటతీరుతో కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ క్రికెట్ తో సంబంధం లేకుండా కేవలం అభిమానుల ప్రేమాభిమానాలతో ఈ  ఘనత  సాధించడం  విశేషం. 
 
PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !