ధోని, హార్దిక్ లకు లైసెన్స్ లభించింది...ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే: హర్భజన్

By Arun Kumar PFirst Published May 17, 2019, 9:31 PM IST
Highlights

ప్రపంచ కప్ మహా సమరానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ దానిపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కేవలం వారే కాదు ఆటగాళ్లు, మాజీలు, విశ్లేషకులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మెగా టోర్నీ గురించే చర్చిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్ హర్భజన్ సింగ్ ఏకంగా మిగతా జట్ల బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. భారత  జట్టులోని  హిట్టర్లు మహేంద్ర సింగ్ ధోని,  హర్దిక్ పాండ్యాలతో జాగ్రత్తగా వుండాలని వారికి సూచించాడు. 

ధోని, పాండ్యాలకు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా వుందని హర్భజన్ పేర్కొన్నాడు.  మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగి ఎన్నోసార్లు వీరు మెరుపులు మెరిపించిన సందర్భాలున్నాయి. అయితే ఈ ప్రపంచ కప్ లో వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటానికి వారికి బిసిసిఐ నుండి లైసెన్స్ లభించిందని అన్నాడు. టీం మెనేజ్ మెంట్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా వారి సహజరీతిలో చెలరేగుతూ బ్యాటింగ్ చేయనివ్వాలని ఆదేశించినట్లు హర్భజన్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

టీమిండియా  టాప్ ఆర్ఢర్లో ఓపెనర్లు  శిఖర్ ధావన్, రోహిత్ శర్మలతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లు  మంచి ఇన్నింగ్స్ నిర్మిస్తే అప్పుడు వీరిద్దరిపై ఒత్తిడి వుండదు. ఆ సమయంలో ధోని, పాండ్యాల విశ్వరూపం చూడవచ్చు. అలాకాకుండా  టాప్ ఆర్డర్  విఫలమైతే  సమయోచితంగా ఆడాలి కాబట్టి వికెట్ ను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేస్తారు. కాబట్టి అంత వేగంగా బ్యాటింగ్ చేయలేరని హర్భజన్ పేర్కొన్నాడు. 

తాము ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్లు బాదగల సత్తా వీరి సొంతం. స్పిన్నర్ల బౌలింగ్ లో భారీ  సిక్సర్లు బాదగల సమర్థులు. ముఖ్యంగా ధోని  సిక్సర్లలో చాలా జీవం వుంటుంది. అతడు బంతిని  గట్టిగా బాదాడంటే అది బౌండరీ అవతల పడాల్సిందే. అంత  ఖచ్చితమైన షాట్లతో ఆకట్టుకుంటాడు. ధోని,పాండ్యాలు చెలరేగితే తట్టుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు సాధ్యం కాదని హర్భజన్ వెల్లడించాడు. 

click me!