ధోని, రోహిత్‌ల కంటే కోహ్లీనే కీలకం...ప్రపంచ కప్ గెలవాలంటే: విండీస్ దిగ్గజం హోల్డర్

By Arun Kumar PFirst Published May 17, 2019, 7:45 PM IST
Highlights

ఐపిఎల్ ద్వారా  ఉత్తమ కెప్టెన్లుగానే కాకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ 12లో ముంబై విజేతగా, సీఎస్కే రన్నరప్ గా నిలవడంతో వారిద్దరి కెప్టెన్సీపై మరింత ఎక్కువగా ప్రశంసలు కురిశాయి. వీరిద్దరితో ఆర్సిబి కెప్టెన్  విరాట్ కోహ్లీని  పోలుస్తూ అతడో చెత్త కెప్టెన్ అంటూ చాలామంది విమర్శలు చేశారు. అయితే ఐపిఎల్ ముగిసి ప్రపంచ  కప్ కు సమయం దగ్గరపడుతున్నా కోహ్లీపై విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. అయితే ఈ  విమర్శలను తిప్పికొడుతూ వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ మెకెల్ హోల్డర్ విరాట్ కోహ్లీని ప్రపంచ స్థాయి ఆటగాడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 
 
టీమిండియా  జట్టును ప్రపంచ కప్ అందిచగల సత్తా వున్న ఆటగాడు కోహ్లీ అని తెలిపారు. అతడు కేవలం ఆటగాడిగానే కాదు కెప్టెన్ గా జట్టుని ముందుడి నడిపి జట్టుకు విజయాలు అందించగలడని అన్నారు. మొత్తంగా ఇప్పుడున్న భారత జట్టులో అతడు కీలకమైన ఆటగాడని...ఈ  వరల్డ్ కప్ తర్వాత అతడి పేరు మరింత మారుమోగుతుందని హోల్డర్ జోస్యం చెప్పాడు. 

ఇక భారత బౌలింగ్ విభాగానికి వస్తే...యువ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా అద్భుతాలు చేయగల సత్తా వున్న ఆటగాడని పేర్కొన్నాడు. కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్, ఇతడి బౌలింగ్ ప్రదర్శనపై నమ్మకంతోనే ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఘన విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నట్లు హోల్డర్ తెలిపాడు. వీరిద్దరు తప్పిస్తే భారత  జట్టులో మిగతా ఆటగాళ్లెవరికి ప్రపంచ కప్ ట్రోఫీని సాధించిపెట్టే సత్తా లేదని హోల్డర్ అభిప్రాయపడ్డారు. 

ఇంగ్లాండ్  జట్టు కూడా ఈ మధ్య కాలంలో అద్భుతంగా ఆడుతోంది. అంతేకాకుండా ఈ  మెగా టోర్నీ వారి సొంత  మైదానాల్లోనే  జరగనున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ ను కూడా సాధించలేని అపవాదును తుడిచేస్తూ సొంత అభిమానుల ముందే ఈ ట్రోఫీని గర్వంగా అందుకోవాలని ఆ జట్టు ఉవ్విళ్లేరుతోంది. అలాంటి ఇంగ్లాండ్‌కు సరైన పోటీనిచ్చే జట్టేదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారత జట్టేనని హోల్డర్ వెల్లడించారు. 

click me!