Asian games 2023 : అదరగొట్టిన టీమిండియా... బంగ్లాను చిత్తుచేసి ఫైనల్ కు రాయల్ ఎంట్రీ

By Arun Kumar P  |  First Published Oct 6, 2023, 11:01 AM IST

యువ బౌలర్ సాయి కిశోర్ బౌలింగ్ మాయ... తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత బ్యాటింగ్ తో ఏషియన్ గేమ్స్ 2023 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓటమిని శాసించారు. 


చైనా వేదికన జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 మెగా టోర్నీలో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే పలు క్రీడా విభాగాల్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండించారు. తాజాగా పురుషుల క్రికెట్ లోనూ మరో పతకం ఖాయమయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకుపోయింది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన టీమిండియా ఫైనల్ కు చేరింది. 

పింగ్ ఫెంగ్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సెమీ ఫైనల్-1 జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా యువ బౌలర్ సాయి కిశోర్ బంగ్లా టాపార్డర్ ను ముప్పుతిప్పలు పెట్టి పరుగులు కట్టడి చేయడమే కాదు మూడు వికెట్లు పడగొట్టాడు.ఇక వాషింగ్టన్ సుందర్ రెండు, తిలక్ వర్మ, రవి బిష్టోయ్, అర్షదీప్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టాడు. ఇలా భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ కేవలం 96 పరుగులకే పరిమితం అయ్యింది. 

Latest Videos

undefined

Read More  ఏషియన్ గేమ్స్ 2023 : భారత్‌కు పతకాల పంట.. దేశం గర్వించేలా చేశారంటూ అథ్లెట్లపై ఏఎఫ్ఐ అధ్యక్షుడు ప్రశంసలు

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో పడకుండానే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ భారత్ ను విజయతీరాలకు చేర్చారు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (55 పరుగులు 36 బంతుల్లో)కి    గైక్వాడ్ (40 పరుగులు 26 బంతుల్లో) కెప్టెన్ ఇన్నింగ్ తోడవడంతో    కేవలం 9.2 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని చేధించి ఫైనల్ కు చేరింది. 

సెమీ ఫైనల్-2 లో పాకిస్థాన్‌-అప్ఘానిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో టీమిండియా ఫైనల్ ఆడనుంది. అయితే ఇప్పటికే ఫైనల్ కు చేరిన భారత్ కు పతకం ఖాయంకాగా మిగిలిన ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే మరో స్వర్ణం ఖాతాలో చేరుతుంది.    
 

click me!