కీల‌క మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు బిగ్ షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం !

By Mahesh Rajamoni  |  First Published May 11, 2024, 5:09 PM IST

Rishabh Pant : ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్, స్టార్ ప్లేయ‌ర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ షాకిచ్చింది. ఆదివారం ఆర్సీబీతో జరిగే కీలక మ్యాచ్  నుంచి పంత్ ఔట్ కావ‌డంతో ఢిల్లీ ప్లేఆఫ్‌ల అవకాశాలపై ప్ర‌భావం ప‌డింది.
 


IPL 2024 Rishabh Pant : ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇక ఆడ‌బోయే అన్ని మ్యాచ్ ల‌ను గెల‌వాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆదివారం రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం. ఈ మ్యాచ్ కు ముందే ఢిల్లీ టీమ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్, స్టార్ ప్లేయ‌ర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ కు దూరంకానున్నాడు. దీని కార‌ణంగా ఢిల్లీ ప్లేఆఫ్‌ల అవకాశాలపై ప్ర‌భావం ప‌డ‌నుంది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కార‌ణంగా డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ తో పాటు రూ.30 లక్షల జరిమానా విధించారు. 2024 మే 7న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ప్రదర్శన‌తో పంత్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు  భారీ జరిమానాతో పాటు ఒక మ్యాచ్ కు ఆడ‌కుండా సస్పెండ్ అయ్యాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ఆర్సీబీతో జరిగే కీలక మ్యాచ్ కు పంత్ దూరం కానున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో డీసీ ప్లేఆఫ్ ఆశ‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే, ఆర్సీబీతో జ‌రిగే మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అవుతుంది.

Latest Videos

ధోని క్రేజ్ అట్లుంట‌ది మ‌రి.. భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని, వీడియో

'ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 8 ప్రకారం మ్యాచ్ రిఫరీ తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ అప్పీల్ దాఖలు చేసింది. దీంతో ఈ అప్పీలును బీసీసీఐ అంబుడ్స్ మన్ పరిశీలనకు పంపారు. అంబుడ్స్ మన్ వర్చువల్ విచారణ నిర్వహించి మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమనీ, దానికి కట్టుబడి ఉంటుందని ధృవీకరించారు' అని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీంతో రిష‌బ్ పంత్ కు రూ.30 ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించారు.

ఐపీఎల్ 2024 సీజ‌న్ లో ఆరంభంలో త‌డ‌బ‌డిన రిష‌బ్ పంత్ ఆ త‌ర్వాత మంచి ఇన్నింగ్స్ ల‌తో కీ ప్లేయ‌ర్ గా మారాడు. రిషబ్ పంత్ తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ సహకారంతో డీసీ బ‌ల‌మైన టీమ్ గా మారింది. పంత్ అద్భుతంగా జ‌ట్టును ముందుకు న‌డిపిస్తున్నాడు. ఆర్సీబీ మ్యాచ్ కు పంత్ దూరం కావ‌డం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ 2024 పాయింట్ల‌ పట్టికలో 5వ స్థానంలో ఉన్న ఢిల్లీ.. చెన్నై, ల‌క్నోల‌తో పాయింట్ల పట్టికలో సమంగా ఉంది. ఆర్సీబీతో ఒకటి, ఎల్ఎస్జీతో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ 2024లో తిరిగి మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు.

కోహ్లీ, రోహిత్ వ‌ల్లకాలేదు.. స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన సాయి సుద‌ర్శ‌న్

click me!