Ranji Trophy: 78 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో 10, 11వ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తనుష్ కొటియన్120 (నాటౌట్), తుషార్ దేశ్‌పాండే 123 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ముంబై జట్టు బరోడా జట్టుకు 606 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.
Tanush Kotian-Tushar Deshpande : రంజీ ట్రోఫీ టెస్టు క్వార్టర్ ఫైనల్స్ లో ముంబై జట్టు ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. 78 ఏండ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా 10, 11వ ఆర్డర్ లో వచ్చిన ప్లేయర్లు సెంచరీలు సాధించారు. ధనుష్ కొటియన్ 10వ స్థానంలో బ్యాటింగ్ కు రాగా, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మన్ తుషార్ దేశ్ పాండే 11వ స్థానంలో వచ్చిన సెంచరీలు కొట్టారు.
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 203 పరుగులు చేయడంతో జట్టు 384 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై 337 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే, 10, 11 స్థానాల్లో ఉన్న ధనుష్ కొటియన్, తుషార్ దేశ్ పాండే సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. సెంచరీలు సాధించి ముంబైకి భారీ స్కోర్ అందించారు. ముంబై జట్టు 569 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు
ధనుష్ 129 బంతుల్లో 120 పరుగులు చేయగా, తుషార్ 129 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 10, 11వ స్థానంలో ఉన్న ప్లేయర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. ధనుష్, తుషార్ క్రికెట్ ప్రపంచంలో ఎన్నడూ చేయని ఘనత సాధించారు. వన్డే తరహా క్రికెట్ ఆడుతూ బంతికి ఒక పరుగు చొప్పున ఎక్కువ పరుగులు చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ధనుష్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. తుషార్ 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. దీంతో ముంబై 569 పరుగులకు ఆలౌటైంది. ధనుష్ చివరి వరకు అజేయంగా నిలిచాడు. చివరి రోజు బరోడా 121 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబై జట్తు సెమీస్ లోకి ప్రవేశించింది. భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్ ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 203 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
Fastest T20I hundred: టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. 33 బంతుల్లోనే సెంచరీ.. !