SMAT 2021 విజేత తమిళనాడు... 14 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన దినేశ్ కార్తీక్...

By team teluguFirst Published Jan 31, 2021, 10:47 PM IST
Highlights

ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో బరోడా చిత్తు...

నాలుగు వికెట్లు తీసిన మునిమరన్ సిద్ధార్థ్...

రెండోసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ గెలిచిన తమిళనాడు...

14 ఏళ్ల కిందట దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోనే..

ఓటమి లేకుండా ఫైనల్ చేరిన తమిళనాడు జట్టు, తుది పోరులో కూడా దుమ్మురేపే ప్రదర్శనతో టైటిల్ సాధించింది. 2006-07 సీజన్‌లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ గెలిచిన తమిళనాడు, మళ్లీ 14 ఏళ్ల తర్వాత అతని కెప్టెన్సీలోనే టైటిల్ గెలవడం విశేషం. 2006-07 సీజన్లో‌ సయ్యద్ ముస్తాక్ ఆలీ టైటిల్ గెలిచిన జట్టులో దినేశ్ కార్తీక్ తప్ప ఎవ్వరూ ప్రస్తుత జట్టులో లేకపోవడం విశేషం.

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందు బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోలంకి 55 బంతుల్లో ఓ ఫోరు, రెండు సిక్సర్లతో 49 పరుగులు చేయగా శేత్ 30 బంతుల్లో 29 పరుగులు చేశాడు.

120 పరుగుల టార్గెట్‌ను 12 బంతులు మిగిలి ఉండగానే చేధించింది తమిళనాడు. ఓపెనర్ హరి నిశాంత్ 38 బంతుల్లో 35 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 22, బాబా అపర్‌జిత్ 29 పరుగులు చేశారు. ఫైనల్‌లో తొలిసారి బరిలో దిగిన మునిమరన్ సిద్ధార్థ్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 

click me!