అనిల్ కుంబ్లే స్పిన్ బౌలింగ్‌ను కాపీ చేసిన జస్ప్రిత్ బుమ్రా... కుంబ్లే రెస్పాన్స్...

Published : Jan 31, 2021, 05:31 PM ISTUpdated : Jan 31, 2021, 05:32 PM IST
అనిల్ కుంబ్లే స్పిన్ బౌలింగ్‌ను కాపీ చేసిన జస్ప్రిత్ బుమ్రా... కుంబ్లే రెస్పాన్స్...

సారాంశం

అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేస్తూ బుమ్రా స్పిన్ బౌలింగ్... వీడియోను పోస్టు చేసిన బీసీసీఐ... బుమ్రా బౌలింగ్‌పై స్పందించిన అనిల్ కుంబ్లే...

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ అవతారం ఎత్తాడు. భారత మాజీ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ, నెట్స్‌లో బౌలింగ్ చేశాడు బుమ్రా. అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేస్తూ బుమ్రా స్పిన్ బౌలింగ్ వేస్తున్న వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది...

‘బుమ్రా యార్కర్లు వేయడం, షార్ప్ బౌన్సర్లు వేయడం మనం చూశాం. ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్‌లో మనం చూడని కోణాన్ని చూపిస్తున్నాడు... బూమ్ అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను వేయడానికి ప్రయత్నించాడు. దాదాపు అచ్చు దించేశాడు కూడా’ అంటూ ఇద్దరి బౌలింగ్‌ను కలగలిపిన వీడియో పోస్టు చేసింది బీసీసీఐ.

 

బీసీసీఐ వీడియోపై అనిల్ కుంబ్లే స్పందించాడు. ‘వెల్‌డన్ బూమ్... చాలా క్లోజ్‌గా ఉంది. నీ బౌలింగ్ స్టైల్‌ని అనుకరించాలని ప్రయత్నించే యువకులకు నువ్వు స్ఫూర్తి... వచ్చే సిరీస్‌లో రాణించాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు కుంబ్లే.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు