కోలుకున్న దాదా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..!!

By Siva KodatiFirst Published Jan 31, 2021, 2:50 PM IST
Highlights

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌‌ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి‌ అయ్యారు. గుండె కవాటాలు పూడుకోవడంతో గురువారం ఆయనకు రెండోసారి యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు రెండు స్టెంట్లు అమర్చారు.

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌‌ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి‌ అయ్యారు. గుండె కవాటాలు పూడుకోవడంతో గురువారం ఆయనకు రెండోసారి యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు రెండు స్టెంట్లు అమర్చారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్‌ దేవి శెట్టి, డాక్టర్‌ అశ్విన్‌ మెహతాలతో కూడిన వైద్య బృందం దాదాకు చికిత్స అందించారు.  

గంగూలీ ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఇప్పుడాయన గుండె సాధారణ స్థితిలో ఉందని శస్త్రచికిత్స అనంతరం వైద్యులు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Also Read:సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు... నిలకడగా ఆరోగ్య పరిస్థితి... రేపు లేదా...

అలాగే కొద్ది నెలల పాటు మందులు వాడాలని డాక్టర్లు సూచించారు. కాగా, ఈ నెల ఆరంభంలో దాదాకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో యాంజియోప్లాస్టీ చేశారు. తర్వాత డిశ్ఛార్జి అయ్యి ఇంటికి వెళ్లాక దాదా క్రమంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత బుధవారం మరోసారి ఛాతిలో ఇబ్బందిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. మళ్లీ పరీక్షించిన వైద్యులు రెండోసారి యాంజియోప్లాస్టీ చేశారు. 

click me!