T20WC 2021 ENGvsNZ Semi-final 1: టాస్ గెలిచిన న్యూజిలాండ్... ఫైనల్ చేరేదెవ్వరో...

By Chinthakindhi RamuFirst Published Nov 10, 2021, 7:07 PM IST
Highlights

T20 Worldcup 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఇంగ్లాండ్ జట్టు 2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీని సొంతం చేసుకోగా, న్యూజిలాండ్ జట్టు ఇదే ఏడాది ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన ఉత్సాహంతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి చేరుకుంటుంది. 

Read: ఆ ముగ్గురినీ టీమిండియాకి సెలక్ట్ చేయడం వెనక భారీ ప్లానింగ్... ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు...

ఇంతకుముందు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలబడ్డాయి. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హైడ్రామా నడిచిన ఫైనల్‌గా ఈ మ్యాచ్‌ చరిత్రలో నిలిచిపోయింది... ఫైనల్‌లో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. 

లక్ష్యఛేదనలో 50 ఓవర్లలో సరిగా 241 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్ జట్టు. ఆఖర్లో అదిల్ రషీద్, మార్క్ వుడ్ రనౌట్ కావడంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే బెన్ స్టోక్స్ రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించిన సమయంలో న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన ఓ త్రో, స్టోక్స్‌ బ్యాట్‌కి తగిలి బౌండరీకి దూసుకెళ్లింది. అంపైర్లు దీనికి 6 పరుగులు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది...

సూపర్ ఓవర్‌లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ చెరో ఫోర్ బాదడంతో ఆరు బంతుల్లో 15 పరుగులు వచ్చాయి. జేమ్స్ నీశమ్ ఓ సిక్సర్ బాదడంతో ఐదు బంతుల్లో 13 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో మార్టిన్ గుప్టిల్ సింగిల్ తీసి, రనౌట్ అయ్యాడు. దీంతో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ని విజేతగా నిర్ణయించారు అంపైర్లు... ఈ నిర్ణయంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు...

ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌కి మంచి రికార్డు ఉంది. అయితే న్యూజిలాండ్ ఈసారి ఆ పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ 1లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, గ్రూప్ స్టేజ్‌లో నాలుగు విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా సెమీస్‌కి అర్హత సాధించింది. అయితే సూపర్ 12లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో 10 పరుగుల తేడాతో ఓడింది ఇంగ్లాండ్... 

మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ 2లో నాలుగు విజయాలతో సెమీస్‌కి వచ్చింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడిన న్యూజిలాండ్, ఆ తర్వాత టీమిండియా, స్కాట్లాండ్, నమీబియా, ఆఫ్ఘాన్‌లను ఓడించి ప్లేఆఫ్స్‌కి చేరింది... 

Read Also: ఐపీఎల్ ఆడితేనే, టీమ్‌కి సెలక్ట్ చేస్తారా... ఆ ఇద్దరూ ఇంకేం చేయాలి... హర్భజన్ సింగ్ కామెంట్స్...

ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, మొయిన్ ఆలీ, ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

 

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్టిల్, డార్ల్ మిచెల్, కేన్ విలియంసన్, డివాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీశమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోథీ, ట్రెంట్ బౌల్ట్


 

click me!