t20 worldcup 2021: మొదటి మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం... నమీబియాను చిత్తు చేసి...

By Chinthakindhi RamuFirst Published Oct 18, 2021, 10:44 PM IST
Highlights

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న శ్రీలంక... 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంకను ఆదుకున్న ఫెర్నాండో, రాజపక్ష...

టీ20 వరల్డ్ కప్ 2021   టోర్నీని శ్రీలంక జట్టు విజయంతో ఆరంభించింది.  గ్రూప్ ఏలో నమీబియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి, తొలి విజయాన్ని అందుకుంది. 97 పరుగుల ఈజీ టార్గెట్ ఛేదనలో మూడు వికెట్లు కోల్పోయినా, ఆవిష్క ఫెర్నాండో, భనుకా రాజపక్ష రాణించి లంకకు విజయాన్ని అందించారు...

కుశాల్ పేరెరా 11, పతుమ్ నిశ్శక 5, దినేశ్ చండీమల 5 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక. నిన్న స్కాట్లాండ్ చేతుల్లో బంగ్లా ఓడినట్టుగా నమీబియా చేతుల్లో లంకకు పరాభవం తప్పదేమో అనే అనుమానం కలిగింది. 

Must Read: టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

అయితే ఆవిష్క ఫెర్నాండో 28 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు, భనుక రాజపక్ష 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేయడంతో లంకకు విజయం దక్కింది. నాలుగో వికెట్‌కి అజేయంగా 74 పరుగులు జోడించిన ఈ ఇద్దరూ 13.3 ఓవర్లలో మ్యాచ్‌ను పూర్తి చేశారు... అంతకుముందు లంక బౌలర్ల ధాటికి నమీబియా 19.3 ఓవర్లలో 96 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి: INDvsENG వార్మప్ మ్యాచ్: భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్... మూడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

click me!