T20 worldcup 2021: ఐర్లాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక... సూపర్ 12లో బెర్త్ కన్ఫార్మ్...

By Chinthakindhi RamuFirst Published Oct 20, 2021, 11:10 PM IST
Highlights

172 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగి 101 పరుగులకి ఆలౌట్ అయిన ఐర్లాండ్... 70 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న శ్రీలంక...

T20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో వరుసగా రెండు విజయాలు అందుకున్న శ్రీలంక జట్టు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది లంక జట్టు...

172 పరుగల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన పసికూన ఐర్లాండ్, ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు అనిపించలేదు. సీనియర్ ఓపెనర్ కెవిన్ ఓ బ్రెయిన్ 5 పరుగులు చేసి మొదటి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ కాగా, పాల్ స్టెర్లింగ్ 7, గారెత్ డెలనీ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

Latest Videos

32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది ఐర్లాండ్. కెప్టెన్ ఆండ్రూ బాల్బెరిన్, కర్టస్ కాంపర్ కలిసి నాలుగో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 28 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన కాంపర్‌ను దీక్షణ బౌల్డ్ చేయడంతో 85 పరుగుల వద్ల నాలుగో వికెట్ కోల్పోయింది ఐర్లాండ్...

Must READ: T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

ఆ తర్వాత హ్యారీ టెక్టర్ 3, నీల్ రాక్ 1 పరుగు చేసి అవుట్ కాగా మార్క్ అడైర్ 2 పరుగులకి రనౌట్ అయ్యాడు...  39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి ఒంటరిపోరాటం చేసిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బెరిన్‌ని లాహిరు కుమార అవుట్ చేయడంతో ఐర్లాండ్‌కి ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి...

చివర్లో యాంగ్ 1, జోషువా 1 పరుగు చేసి అవుట్ కావడంతో 101 పరుగుల వద్ద ఐర్లాండ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లు తీయగా, లహిరు కుమార, కరుణరత్నేలకి చెరో రెండు వికెట్లు దక్కాయి.. బ్యాటింగ్‌లో 71 పరుగులు చేసి లంకను ఆదుకున్న హసరంగ, నాలుగు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా పడగొట్టాడు.. 

తొలి గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన ఐర్లాండ్ జట్టు, తన తర్వాతి మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 2లో నిలిచి, లంకతో పాటు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించే అవకాశం పొందుతుంది ఐర్లాండ్...

మరోవైపు పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగుల భారీ స్కోరు చేసింది. 187 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఛేదించింది సఫారీ జట్టు. 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ హుస్సేన్, ఆఖరి బంతికి బౌండరీ బాది జట్టుకి విజయాన్ని అందించడమే కాకుండా సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

ఇది చదవండి: T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

click me!